రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసులకు లేఖ రాసిన హేమ.. ఏమన్నారంటే

బెంగుళూరు డ్రగ్స్ కేస్‎లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈరోజు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మాకొట్టే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. అందులో నటి హేమ (కొల్లా కృష్ణవేణి)కు పాజిటివ్ అని తేలింది. గత వారం బెంగుళూరు పోలీసులు జారీ చేసిన సమన్ల మేరకు హేమతో పాటు మరో ఏడుగురు నిందితులు మే 27న సోమవారం పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది.

రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసులకు లేఖ రాసిన హేమ.. ఏమన్నారంటే
Hema
Follow us

|

Updated on: May 27, 2024 | 3:45 PM

బెంగుళూరు డ్రగ్స్ కేస్‎లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈరోజు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మాకొట్టే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. అందులో నటి హేమ (కొల్లా కృష్ణవేణి)కు పాజిటివ్ అని తేలింది. గత వారం బెంగుళూరు పోలీసులు జారీ చేసిన సమన్ల మేరకు హేమతో పాటు మరో ఏడుగురు నిందితులు మే 27న సోమవారం పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది. డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారందరినీ ఒకేసారి విచారణ జరపడం సాధ్యం కాని నేపథ్యంలో ఈరోజు ఎనిమిది మందిని విచారణకు హాజరుకావల్సిందిగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తాను విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని హేమ కోరినట్లు సమాచారం. ఈక్రమంలోనే తాను వైరల్ ఫీవర్‎తో బాధపడుతున్నట్టు బెంగుళూరు సీసిబికు హేమ లేఖ రాశారు. అయితే హేమ సీసీబీ పోలీసులు హేమ లేఖను పరిగణలోకి తీసుకోలేదు. తిరిగి ఆమెకు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బెంగుళూరు పోలీసులు. ఇదిలా ఉంటే నటి హేమ ఏపీలోని పలువురు రాజకీయ నాయకుల నుంచి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు సీసీబీకు పదే పదే ఫోన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనను అరెస్ట్ చేయవద్దని హేమ ఒత్తిడి చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సంఘటనపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు. హేమ పరువుతీసేలా ప్రచారం చేయొద్దన్నారు. ఆమెపై ఇంకా నేరం రుజువుకాలేదని, పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఒకవేళ పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి వస్తే అప్పుడు తగిన చర్యలు తీసుకంటామని తెలిపారు. మే 19 తెల్లవారుజామున బెంగళూరు శివార్లలో ఎలక్ట్రానిక్ సిటీ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడులు చేశారు. అక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని వారి రక్త నమూనాలను సేకరించారు పోలీసులు. ఫలితాల్లో తెలుగు సినీ నటి హేమ సహా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని గత గురువారం పోలీసులు తెలిపారు. అలాగే దాడులు చేసిన ప్రదేశంలో సమారు రూ. 1.5 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో MDMA (ఎక్‌స్టసీ) మాత్రలు, హైడ్రో గంజా, కొకైన్, అత్యాధునిక కార్లు, DJ పరికరాలు, సౌండ్, లైటింగ్ పరికరాలు ఉన్నట్లు తెలిపారు. వాటిని సీజ్ చేశారు. ఈ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్న వారిని విడతల వారీగా విచారిస్తున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీకి మొత్తం 103 మంది హాజరయ్యారని సమాచారం. పాల్గొన్నవారిలో 73 మంది పురుషులు కాగా 30 మంది మహిళలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…