Actor Sriram: హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? నెట్టింట వైరలవుతున్న ఫ్యామిలీ ఫోటోస్..

శ్రీరామ్ ఫ్యామిలీ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియదు. సినిమా ఫంక్షన్స్.. ప్రైవేట్ పార్టీలలోనూ శ్రీరామ్ తన ఫ్యామిలీతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఈ హీరో ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో శ్రీరామ్ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్న ఈ హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా ? అంటూ షాకవుతున్నారు.

Actor Sriram: హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? నెట్టింట వైరలవుతున్న ఫ్యామిలీ ఫోటోస్..
Actor Sriram
Follow us

|

Updated on: May 08, 2024 | 5:22 PM

తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో సుపరిచితమే. కానీ పేరు అంతగా తెలియకపోవచ్చు. ఒకరికి ఒకరు, స్నేహితులు మూవీస్ పేర్లు చెబితే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో ఆకట్టుకున్నాడు శ్రీరామ్. తెలుగబ్బాయే అయినా ముందుగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రోజా కూటం అనే సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను తెలుగులో రోజా పూలు పేరుతో డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో ఒకరికి ఒకరు సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ మూవీని నేరుగా తెలుగులో తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శ్రీరామ్‏కు తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో చేయలేకపోయారు.

తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు శ్రీరామ్. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు సినిమాలకు చాలా కాలం గ్యాప్ తీసుకున్న శ్రీరామ్ వెంకటేశ్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో వెంకీ స్నేహితుడిగా కనిపించారు. ఆ తర్వాత పోలీస్ పోలీస్, దడ, నిప్పు, సుప్రీమ్, లై, శ్రీనివాస కళ్యాణం, సీత, రాగల 24 గంటల్లో, నమస్తే నేస్తమా వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. విజయ్ దళపతి హీరోగా నటించిన స్నేహితులు సినిమాలో శ్రీరామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వెండితెరపై కాకుండా ఓటీటీలోనూ అలరిస్తున్నారు. ఇటీవలే పిండం అనే హార్రర్ వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్లా్ట్ ఫామ్ పై సందడి చేశాడు. అలాగే ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. శ్రీరామ్ ఫ్యామిలీ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియదు. సినిమా ఫంక్షన్స్.. ప్రైవేట్ పార్టీలలోనూ శ్రీరామ్ తన ఫ్యామిలీతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఈ హీరో ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో శ్రీరామ్ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్న ఈ హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా ? అంటూ షాకవుతున్నారు. శ్రీరామ్ 2008లో వందన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె అహానా.. కుమారుడు ఆహిల్ ఉన్నారు. తాజాగా శ్రీరామ్ భార్య వందన తమ ఫ్యామిలీ గోవా వెకేషన్ లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. అందులో శ్రీరామ్ కుమార్తే అహానా కూడా కనిపిస్తుంది. అహానా లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం శ్రీరామ్ ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..