AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే.. రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ నిజమేనా?

సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడకు పాల్పడుతున్నారు. ‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. మొదట నమ్మలేదని, కానీ నిజంగానే డబ్బులు వచ్చాయని చెప్పేలా మెసేజ్‌లు ఉండటంతో చాలామంది మోసపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే.. రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ నిజమేనా?
Cyber Alert
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 12:56 PM

Share

సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడకు పాల్పడుతున్నారు. ‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. మొదట నమ్మలేదని, కానీ నిజంగానే డబ్బులు వచ్చాయని చెప్పేలా మెసేజ్‌లు ఉండటంతో చాలామంది మోసపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా లింకులు పూర్తిగా నకిలీవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ ఆఫర్లు వచ్చాయని ఆసక్తితో లింక్‌ను ఓపెన్ చేస్తే మొబైల్‌లోకి మాల్వేర్ చొరబడుతుంది. ఫోన్‌లో ఉన్న ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి, క్షణాల్లో ఖాతాలు ఖాళీ అవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండగ వేళ ఎవరూ ఉచితంగా డబ్బులు పంచరని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లు ఎప్పటికీ లింక్‌ల ద్వారా డబ్బులు ఆఫర్ చేయవని, అలాంటి సందేశాలు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.

ఇక సన్నిహితులు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అయినా సరే, నిజమని భావించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ లింక్‌లను క్లిక్ చేసి డబ్బులు కోల్పోయినవారు చాలా మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాయ ఉచ్చులో పొరపాటున చిక్కుకుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైం హెల్ప్‌ లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సమయానికి సమాచారం అందిస్తే నష్టాన్ని కొంతవరకు నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?