Kamal Haasan : కమల్ హాసన్‌తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? తల్లి స్టార్ హీరోయిన్.. తండ్రి పాపులర్ విలన్.. బ్యాగ్రౌండ్ చూస్తే..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. చాలా కాలంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యింది. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ ను తన తల్లితో కలిసింది. ఇందుకు సంబందించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో కమల్ హాసన్ పక్కన కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె తల్లి సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది. వైవిధ్యమైన పాత్రలు.. అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. అలాగే తండ్రి సైతం ఫేమస్ నటుడు. విలన్ పాత్రలతోనూ మెప్పించారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆ అమ్మాయి పేరు తేజలక్ష్మి. సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురు. 1983లో భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ముందనై ముడిచ్చు’ సినిమాతో ఊర్వశి తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా బిజీగా ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఆమె సినిమాల్లో యాక్టివ్ గా ఉంది. ఇప్పటికే 2 జాతీయ అవార్డులు, 6 కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 2 తమిళనాడు ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. ఆమె ఇటీవల ‘ఉల్లోజుక్కు’ చిత్రానికి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఊర్వశి కూతురు తేజలక్ష్మి సైతం మలయాళీ సినీరంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె మలయాళ చిత్రం ‘సుందరియావల్ స్టెల్లా’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే తేజలక్ష్మి ఊర్వశితో కలిసి ‘పాబ్లో పార్టీ’ చిత్రంలో కూడా నటిస్తోంది.తాజాగా తల్లితో కలిసి తేజలక్ష్మి కమల్ హాసన్‌ను కలిసి ఆయన ఆశీస్సులు పొందింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి : స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఎగబడి చూసేస్తోన్న జనాలు.. రెండేళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పాట..
తేజలక్ష్మి ఇప్పుడు మలయాళంలో బ్యా్క్ టూ బ్యాక్ సినిమా అవకాశాలు అందుకుంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తేజలక్ష్మి తండ్రి మనోజ్ కె.జయన్. సినిమాల్లో పాపులర్ నటుడు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించారు. సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యాడు. కానీ కొన్నాళ్లకే ఊర్వశి, మనోజ్ విడాకులు తీసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..
