Threatening calls: ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ప్రాణ హాని ఉందని బెదిరింపు కాల్స్.. పోలీసుల అదుపులో నిందితుడు..
ఈమధ్య కాలంలో ప్రముఖ వ్యాపార వేత్తలకు బెదిరింపులు వస్తున్నాయి. గతంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే ముంబాయి వేదికగా మరోసారి ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందని కాల్స్ వచ్చిన విషయం ఇప్పుడు హాట్ టాపిగ్ గా మారింది. ఇటీవల ముంబాయి పోలీసు కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.

కాల్ చేసిన వ్యక్తి రతన్ టాటా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆయనకు భద్రత పెంచాలని లేకుంటే సైరస్ మిస్త్రీలాగే అవుతుందని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సైరస్ మిస్త్రీ టాటా సన్స్ కు మాజీ చైర్మెన్ గా బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది ఆహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఈ వారం ప్రారంభంలో ఈ ఘటన చోటు చేసుకుంటే.. మూడు రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు ముంబాయి పోలీసులు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రతన్ టాటా భద్రతను పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. ఆయన ఇంటి పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
రతన్ టాటాకు ప్రాణ హాని ఉందని పోలీసులకు వచ్చిన కాల్ ని ట్రేస్ చేశారు క్రైం బ్రాంచ్ పోలీసులు. అయితే ఈ కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్లు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకుని ముంబాయికి తీసుకొచ్చారు. అతనిని విచారించగా పూణెకు చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..