Sabarimala: శబరిమలలో అయ్యప్త భక్తుల అగచాట్లు.. కేరళ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం 

అయ్యప్ప..దర్శనానికి రావాలా?ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇదీ అయ్యప్ప భక్తుల ఆ వేదన,ఆందోళన.  శబరిలో రద్దీ ఇంకా క్రమబద్దీకరించబడలేదు. అంతకంతకూ రద్దీ పెరుగుతోంది. అక్కడి పరిస్థితులు  తెలుసుకొని వెళ్లాలా వద్దా  అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్‌కోర్‌ బోర్డు, కేరళ సర్కార్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది

Sabarimala: శబరిమలలో అయ్యప్త భక్తుల అగచాట్లు.. కేరళ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం 
Sabarimala Rush
Follow us
Basha Shek

|

Updated on: Dec 16, 2023 | 6:25 AM

అయ్యప్ప..దర్శనానికి రావాలా?ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇదీ అయ్యప్ప భక్తుల ఆ వేదన,ఆందోళన.  శబరిలో రద్దీ ఇంకా క్రమబద్దీకరించబడలేదు. అంతకంతకూ రద్దీ పెరుగుతోంది. అక్కడి పరిస్థితులు  తెలుసుకొని వెళ్లాలా వద్దా  అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్‌కోర్‌ బోర్డు, కేరళ సర్కార్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. స్వామియే  శరణం అయప్ప… శరణు ఘోషతో   శబరిమల మార్మోగుతోంది. మరోవైపు  రికార్డుస్థాయి రద్దీతో భక్తులకు చుక్కలు కన్పిస్తున్నాయి. భక్తులు లక్షల్లో  పోటెత్తడంతో  క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కాలుతీసి కాలు కదపలేదని పరిస్థితిలో  ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. కొండ కింద పంబ నుంచి సన్నిదానం వరకు  క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి.ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ… పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం గగనమవుతోంది.

కేరళ ప్రభుత్వమే కారణం..

శబరిమలలో రద్దీ అంతకంతకు పెరుగుతోంది., క్యూలైన్ల క్రమబద్దీకరణ, భద్రతా  ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రద్దీని కంట్రోల్‌ చేయడంలో ప్రత్యామ్నాలు ఏర్పాటు చేయడంలో ..భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో  ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  శబరిలో భక్తుల దైన్యానికి  కేరళ సర్కార్‌ వైఫల్యేమే కారణమని ట్వీట్‌ చేశారు  కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ . మరోవైపు కేరళ బీజేపీ నేత రాజశేఖరన్‌  శబరిమలను సందర్శించారు. భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించడంలేదని  ఆరోపించారాయన.  దేశవ్యాప్తంగా  ఇలా  విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తుల ఆందోళన…

మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను.. పినరయి సర్కర్‌ తోసిపుచ్చింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు కేరళ దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ .  పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. రాజకీయ రాద్దాంతం చేయకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు  అంతా సహకరించాలని కోరింది కేరళ సర్కార్‌ . శబరిలో భక్తులు ఎదుర్కొంటన్న ఇక్కట్లపై  ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు శబరికి వెళ్లాలా? వద్దా? అనే డైలామా పడుతున్నారు భక్తులు. అల్రెడీ ఊళ్లలో నుంచి బయలుదేరిన వాళ్లు..అక్కడి పరిస్థితి గురించి తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు.   కేరళ హైకోర్టు శబరిమలలో యుద్దప్రాతిపదికన పరిస్థితిని చక్కదిద్దలాని ప్రభుత్వాన్ని  ఆదేశించింది కేరళ  హైకోర్టు.  స్పందించిన సర్కార్‌  ఉన్నపళంగా  బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి పోలీస్‌ బలగాలను తరలిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్దీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..