Stray Dogs: వీధి శునకాల పర్యవేక్షణ కోసం వింత ఆలోచన.. ఆధార్ కార్డు తరహా కార్డులు
దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు కుక్కల బెడదను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు, ఏ క్షణాన కుక్క కరుస్తోందోనని వీధుల్లో బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వాటి నియంత్రణ, పర్యవేక్షణ కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు.
దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు కుక్కల బెడదను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు, ఏ క్షణాన కుక్క కరుస్తోందోనని వీధుల్లో బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వాటి నియంత్రణ, పర్యవేక్షణ కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలోని ముంబయిలో అధికారులు వీధి కుక్కల బెడతను నియంత్రించి వాటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాధారణంగా పౌరులకు ఆధార్ కార్డ్ ఇచ్చే మాదిరిగానే శునకాలకు కూడా వాటికి సంబంధించిన సమాచారంతో ట్యాగ్‌లు అమర్చేలా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే విమానశ్రయానికి సమీపంలోని కొన్ని శునకాలకు అచ్చం ఆధార్ కార్డు లానే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఐడెంటిటీ కార్డులు తగిలించారు.
వివరాల్లోకి వెళ్తే ముంబయిలోని సాయన్ ప్రాంత వాసి అక్షయ్ రిడ్లాన్ అనే ఇంజనీర్.. వీధి కుక్కలను పర్యవేక్షించేందుకు ఓ డేటాబేస్ ఉండాలని అనుకున్నారు. అందుకోసం తన మిత్రులతో కలిసి వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ సిస్ట్‌మ్‌ను రూపొందించారు. ఆ శునకాల మెడలో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ శునకాల పేర్లు.. వాటికి ఆహారం అందించే వ్యక్తల వివరాలు కనిపిస్తాయి. అలాగే ఆ కుక్కల వ్యాక్సినేషన్ రికార్డు, స్టెరిలైజన్ చేశారా లేదా.. దానికి సంబంధించిన మెడికల్ హిస్టరీ అంతా ఆ క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లకు అనుసంధానం చేస్తున్నారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సహయంతోనే శునకాలకు ట్యాగ్‌లు తగిలించే కార్యక్రమం చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి