Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opposition Meeting: బెంగుళూరు వేదికగా ఐక్యతారాగం అందుకున్న విపక్షాలు.. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా..

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యతారాగం అందుకున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఐక్యమవుతున్నాయి. బెంగుళూరు వేదికగా జరిగిన విపక్షాల ఐక్య సమావేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు ఎన్డీఏ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో పోటాపోటీ మీటింగ్‌..ఎన్నికల వేడిని రాజేస్తున్నాయి.

Opposition Meeting: బెంగుళూరు వేదికగా ఐక్యతారాగం అందుకున్న విపక్షాలు.. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా..
Opposition Meeting
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 17, 2023 | 9:41 PM

రాబోయే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా దేశంలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాల ఐక్య సమావేశం ముగిసింది. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరిగే విపక్షాల మీటింగ్‌కి దాదాపు అన్ని పార్టీలూ హాజరయ్యాయి. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌, మమతా బెనర్జీ, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ జాతీయాధ్యక్షులు రాజీవ్ రంజన్ సింగ్, సంజయ్ కుమార్ ఝా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, నితీష్‌ కుమార్‌, కేజ్రీవాల్‌…బెంగుళూరు సమావేశానికి హాజరయ్యారు. రేపటి సమావేశానికి హాజరవుతానని వెల్లడించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.

జూన్‌ 23న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి మొత్తం 15పార్టీలు హాజరయ్యాయి. ఈసారి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. కూటమికి కొత్త పేరు, సమన్వయకర్త నియామకం, ఆందోళన కార్యక్రమాలు. విపక్షాల మధ్య సీట్ల పంపకాలు, కమిటీల ఏర్పాటుపై సమావేశం చర్చించింది. ప్రతిపక్షాల ఐక్యతపై తదుపరి వ్యూహాలు ప్రకటించనుంది కాంగ్రెస్‌.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకు పోతుందని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యదవ్‌ బెంగుళూరులో వ్యాఖ్యానించారు. దేశప్రజలు బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తారన్నారు. మూడొంతుల మంది జనం BJPని ఇంటికి సాగనంపుతారన్నారు. దేశంలోని అన్ని వైపుల నుంచి తనకు సమాచారం అందుతోందన్నారు. ఓవైపు విపక్షాల భేటీ జరుగుతోంటే…మరోవైపు రేపు ఢిల్లీలో ఎన్డీయే మీటింగ్‌కి సన్నాహాలు చేస్తోంది.

అక్కడ 26 పార్టీలైతే… ఇక్కడ 38 పార్టీలు…ఢిల్లీలో పాల్గొనబోతున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. ఎన్డీఏ ఢిల్లీకి చేరుకున్నారు పవన్‌ కల్యాణ్‌. దేశ సేవే లక్ష్యంగా ఆదర్శనీయమైన కూటమి మాదని అన్నారు జేపీ నడ్డా. యూపీఏకి సారథిలేడనీ, నిర్ణయాలు తీసుకునే దమ్ము అంతకన్నా లేదనీ వ్యాఖ్యానించారు. ఆ కూటమి ఫొటోలకోసమేనని ఎద్దేవా చేశారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఐక్యంగా నిలుస్తామని ప్రకటించింది విపక్షాల తొలి ఐక్య సమావేశం.. బెంగళూరు వేదికగా విపక్షాల మలివిడత సమావేశం ఐక్యతపై స్పష్టతనిస్తుందా?… మరోవైపు ఎన్డీఏ మీటింగ్ ఏ సంకేతాలివ్వబోతుందన్నది అనేది వేచి చూడాల్సిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం