Viral: బీచ్ తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు.. లోపల ఏముంది..?
ఈ ఆబ్జెక్టు ఎక్కడిదో, ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రజలు దాని వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఈ సిలిండర్ ఆకారాన్ని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు.
యానం, 18 జులై: సముద్రంలోని నుంచి వింత వస్తువులు లేదా ఆకారాలు కొట్టుకోచ్చాయి అనుకోండి. కాస్త ఆశ్యర్యంతో పాటు భయం కూడా వేస్తుంది. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది. ఇప్పుడు ఆస్త్రేలియాలో అదే సస్పెన్స్ కొనసాగుతుంది. పశ్చిమ ఆస్త్రేలియా… పెర్త్‌కి ఉత్తరాన 250 కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రీన్‌హెడ్ బీచ్‌కు గోపురం ఆకారంలో ఉన్న ఓ భారీ లోహపు వస్తువు కొట్టుకువచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. స్టేట్‌తో పాటు సెంట్రల్ అధికారులు సైతం అలెర్ట్ అయ్యారు. ఆ వస్తువు ఏంటా అని పరిశీలిస్తున్నారు. అది డేంజరస్ వస్తువు అని ప్రకటించిన పోలీసులు.. దాని దగ్గరకు వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఆ వస్తువు 2.5మీ. నుంచి 3మీ. వరకు పొడవు.. సుమారు 2.5 మీ. వెడల్పు ఉంది. అది హిందూ సముద్రంలో పడిపోయిన ఏదైనా రాకెట్‌కు సంబంధించిన శకలం అని కొందరు.. విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుంచి పడిపోయిన భారీ సిలిండర్ మరికొందరు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. 2014లో మిస్సయిన MH 370 విమాన శకలం అని కూడా వార్తలు వ్యాపిస్తున్నాయి. 239 మంది పాసింజర్స్‌తో 2014లో ఈ ఫ్లైట్ మిస్సయ్యింది. ఆ తర్వాత దాని ఆచూకి దొరకలేదు. ఇదేంటో తెలుసుకునేందుకు ఇతర అంతర్జాతీయ స్పేస్ సెంటర్లను, ఏజెన్సీలను కూడా ఆస్త్రేలియా అధికారులు సంప్రదిస్తున్నారు. త్వరలోనే దీనిపై మిస్టరీ వీడే ఛాన్స్ ఉంది.
ఇలా సముద్ర తీర ప్రాంతాలకు ఇలాంటి వస్తువులు కొట్టుకురావడం కొత్తేమీ కాదు. దేశవిదేశాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని పలు తీర ప్రాంతాలకు వింత గోళాలు, రథాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..