అటవీ అధికారులను చూసి పారిపోయేందుకు యత్నం.. ఆపి తనిఖీ చేస్తే షాకింగ్ సీన్..!
అది ఆంధ్రా - ఒడిశా సరిహద్దు.. అడవీ అధికారులు మాటు వేసుకుని కూర్చున్నారు. ఆ రోడ్డు నుంచి ఏదో అక్రమంగా తరలిపోతుందనేదీ వాళ్ళ అనుమానం..! కాసేపటికి ఓ వ్యాన్ రయ్యిన దూసుకొస్తోంది.
అది ఆంధ్రా – ఒడిశా సరిహద్దు.. అడవీ అధికారులు మాటు వేసుకుని కూర్చున్నారు. ఆ రోడ్డు నుంచి ఏదో అక్రమంగా తరలిపోతుందనేదీ వాళ్ళ అనుమానం..! కాసేపటికి ఓ వ్యాన్ రయ్యిన దూసుకొస్తోంది. ఆదమరిస్తే తప్పించుకుని పారిపోయేంతలా ఉంది. వెంటనే అప్రమత్తమయ్యారు అటవీ సిబ్బంది. స్పీడ్‌గా వస్తున్న వ్యాన్‌ను ఆపే ప్రయత్నం చేశారు. కాస్త స్పీడు తగ్గి వ్యాన్ దగ్గరకు రాగానే అంతా చుట్టుముట్టారు. వ్యాన్‌లో ఉన్నవారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు..! అనుమానం మరింత బలపడింది. వ్యాన్ అంతా చెక్ చేశారు. థర్మకోల్ డబ్బాలు కనిపించాయి. వాడిని ఓపెన్ చేసి చూస్తే, కనిపించిన మూగ జీవాలను చూసి షాక్ అయ్యారు.
ఏవోబీలో తాబేళ్ల అక్రమ రవాణా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు అక్రమంగా తాబేళ్లను రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ సిబ్బంది. ఆంధ్రాలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశా లోనీ మల్కన్‌గిరి జిల్లా కలిమెలా, ఎంవీ 79 గ్రామాలకు వ్యాన్‌లో 500 తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ఒడిస్సా లోని చిత్రకొండ అటవీశాఖ రేంజ్ అధికారులు.
వీడియో చూడండి..
అటవీ సిబ్బంది.. ఒడిశాలోని రాజులకొండ వద్ద మాటు వేశారు .ఆంధ్రా వైపు నుంచి వ్యాన్ వేగంగా వచ్చింది. దానిని ఆపి తనిఖీలు చేయగా థర్మకోల్ బాక్‌లో 500 తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 500 తాబేళ్లు ను స్వాదీనం చేసుకున్నారు. తాబేళ్లు స్మగ్లింగ్ వెనుక ఎవరు వున్నారు అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..