AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: విమానంలో షాకింగ్ ఘటన.. యువతి చేసిన పనికి ఈడ్చుకెళ్లి గెంటేశారు..!

విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా విమానం గంట పాటు ఆలస్యమైంది.

Air India: విమానంలో షాకింగ్ ఘటన.. యువతి చేసిన పనికి ఈడ్చుకెళ్లి గెంటేశారు..!
Woman Thrown Off Flight
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 01, 2024 | 8:38 PM

Share

విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా విమానం గంట పాటు ఆలస్యమైంది. సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం నుంచి ఒక మహిళను భద్రతా సిబ్బంది బలవంతంగా దించేశారు. ఈ ఘటన ప్రయాణికుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

విమానంలో మహిళ తన సీటు విషయమై భద్రతా సిబ్బందితో గొడవపడినట్లు తెలుస్తోంది. ఆమెకు సరియైన సీటు దొరక్కపోవడంతో అసహనంతో ఊగిపోయారు. విమానంలో ప్రవేశించినప్పటి నుంచి క్యాబిన్ సిబ్బందితో గొడవ పడిందని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఆమె కోపంతో క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ గొడవ మరింత తీవ్రమవడంతో, పరిస్థితిని అదుపు చేయలేని స్థాయికి చేరుకుంది.

భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. చివరికి సదరు మహిళను బలవంతంగా విమానం నుంచి కిందకు దించేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరు మహిళా భద్రతా అధికారులు ఆమెను క్యాబిన్ నుండి బయటకు తీసుకువచ్చి, విమానం నుంచి దించేశారు. ఈ పరిణామం విమానంలోని ప్రయాణికులను షాక్‌కు గురిచేసింది. ఈ తతంగం అంతా విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

ఈ సంఘటన వలన విమానం గంట పాటు ఆలస్యంగా బయలుదేరింది. విమానంలోని ఇతర ప్రయాణికులు ఈ ఘటన గురించి చర్చించుకుంటూ, ఆమె ప్రవర్తనతో విమాన సమయానికి ఆలస్యం అయిందని కొందరు మండిపడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎయిర్ ఇండియా అధికారికంగా ఈ ఘటనపై ఏలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..