Samosa: వామ్మో.. ఇదెక్కడి న్యాయం.. కస్టమర్‌పై దాడి.. వేడివేడి సమోసాలు అడిగినందుకు తల పగులగొట్టాడు!
సమోసా చాలా మందికి ఎంతో ఇష్టం. సాధారణంగా చౌకగా లభించే వేడి వేడి సమోసాలు రుచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు వేడి వేడి సమోసాలు తినడానికి ఇష్టపడుతున్నట్లయితే జాగ్రత్త అని చెప్పాల్సిన సమయం వచ్చింది. వేడి సమోసాల కోసం ఒక కస్టమర్ చేసిన అభ్యర్థన ప్రాణాలమీదకు వచ్చింది. దుకాణదారుడిని వేడి వేడి సమోసాలు అడిగినందుకు సదరు దుకాణాదారుడికి తెగ కోసం
సమోసా చాలా మందికి ఎంతో ఇష్టం. సాధారణంగా చౌకగా లభించే వేడి వేడి సమోసాలు రుచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు వేడి వేడి సమోసాలు తినడానికి ఇష్టపడుతున్నట్లయితే జాగ్రత్త అని చెప్పాల్సిన సమయం వచ్చింది. వేడి సమోసాల కోసం ఒక కస్టమర్ చేసిన అభ్యర్థన ప్రాణాలమీదకు వచ్చింది. దుకాణదారుడిని వేడి వేడి సమోసాలు అడిగినందుకు సదరు దుకాణాదారుడికి తెగ కోసం వచ్చింది. వెంటనే కస్టమర్‌పై దాడి చేసి తల పగులగొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ముంబైలోని ముంబ్రా ప్రాంతంలో జరిగింది.
ముంబ్రా నివాసి జియావుద్దీన్ షేక్ వేడి వేడి సమోసాలు తినాలనుకున్నాడు. ముంబ్రాలోని ఆనంద్ కోలివాడకు చెందిన మజీద్ షేక్ అనే దుకాణదారుడి వద్దకు వచ్చాడు. సమోసాలు అడిగిన వెంటనే దుకాణదారుడు సమోసాలు ఇచ్చాడు. అయితే సమోసాలు చల్లగా ఉండడం చూసి జియావుద్దీన్ వేడి వేడి సమోసాలు కావాలని డిమాండ్ చేశాడు. మాజిద్ షేక్ మీరు తినాలనుకుంటే తినండి లేకపోతే బయలుదేరండి అన్నారు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీంతో జియావుద్దీన్ ఆవేశంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కస్టమర్ జియావుద్దీన్ వెళ్లిపోవడంతో దుకాణదారుడు మజీద్ షేక్ ఆగ్రహం చల్లారలేదు. బయటకు వెళ్తున్న జియావుద్దీన్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశారు. ఇందులో జియావుద్దీన్ తలపై బలమైన గాయమైంది. స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలింగా, 5 నుంచి 6 కుట్లు కూడా పడ్డాయి. అతని చెవి కూడా కొద్దిగా తెగిపోయింది. ఈ విషయమై ముంబ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బీహెచ్‌డీవీ 324 కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి