AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. మస్క్‌ సంచలన ట్వీట్‌.. బీజేపీ రియాక్షన్ ఇదే..

టెస్లా, స్పేస్ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రూటే సపరేటు. ఆయన తీరును అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం.. ఏం చేసినా.. ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా.. ఎలోన్ మస్క్ ఈవీఎం (EVM - Electronic Voting Machines) లు హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

Elon Musk: ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. మస్క్‌ సంచలన ట్వీట్‌.. బీజేపీ రియాక్షన్ ఇదే..
Elon Musk
Shaik Madar Saheb
|

Updated on: Jun 16, 2024 | 1:29 PM

Share

టెస్లా, స్పేస్ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రూటే సపరేటు. ఆయన తీరును అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం.. ఏం చేసినా.. ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా.. ఎలోన్ మస్క్ ఈవీఎం (EVM – Electronic Voting Machines) లు హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో EVMలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించవచ్చంటూ సూచించారు. అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్‌ మీడియా X వేదికగా స్పందించారు మస్క్‌. EVMలను వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని.. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో EVMలు తొలగిస్తేనే హ్యాకింగ్‌ను నివారించొచ్చు.. వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు. ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరి ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకొన్నాయన్నారు US మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌. పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగామని.. లేదంటే ఏం జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలని Xలో పోస్ట్‌ చేశారు. దీనిపైనే స్పందించిన ఎలాన్‌ మస్క్‌ ఎన్నికల్లో EVMలను తొలగించడంతోనే హ్యాకింగ్‌ను నివారించొచ్చనడం చర్చనీయాంశంగా మారింది.

ఎలాన్ మస్క్ ట్వీట్..

మస్క్ పోస్ట్ పై బీజేపీ స్పందన.. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఏమన్నారంటే..

మస్క్‌ పోస్ట్‌పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. EVMల హ్యాకింగ్‌ ఇండియాలో సాధ్యం కాదన్నారు. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈవీఎంలకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ గానీ, వైఫై లేదా బ్లూటూత్‌ కనెక్షన్‌ లేదని గుర్తు చేశారు. అప్పుడు హ్యాకింగ్‌కు ఎలా అవకాశం ఉంటుందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రశ్నించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు