Petrol Price: ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. మన దేశంలో కొన్ని నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, కర్ణాటకలో పెట్రోల్‌పై 3 రూపాయలు, డీజిల్‌పై రూ.3.20 మేర పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా ఇక్కడి ప్రభుత్వం మాత్రం లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా 10 రూపాయల వరకు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Petrol Price: ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు
Petrol Price
Follow us

|

Updated on: Jun 16, 2024 | 3:43 PM

పొరుగున ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్థాన్ ఆర్థిక దుస్థితి మీడియాలో కూడా ప్రధానాంశంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈద్ సందర్భంగా కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని నిర్ణయించింది. మే నెల నుంచి దేశంలో ద్రవ్యోల్బణం బాగా తగ్గింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10.20, డీజిల్‌పై రూ.2.33 చొప్పున తగ్గిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం.. పెట్రోల్ ధరలు లీటరుకు రూ.258.16, డీజిల్ ధర రూ.267.89కి తగ్గాయి. తగ్గింపు ధర శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణంగా పాకిస్తాన్ ఆర్థిక శాఖ ప్రతి 15 రోజులకు ఇంధన ధరలను సమీక్షిస్తుంది. తాజా ధర తగ్గింపునకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. కొత్త ధరలు వచ్చే పక్షం రోజుల వరకు వర్తిస్తాయని పేర్కొంది.

ఇదిలా ఉండగా, భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం కర్ణాటకలో పెట్రోల్‌ ధరలపై రూ.3, డీజిల్‌పై 3.20 వరకు పెంచింది అక్కడి ప్రభుత్వం. ఇకపోతే మిగితా రాష్ట్రాల్లో స్థిరంగా ఉంది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర వరుసగా రూ.94.72, రూ.87.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21, డీజిల్ ధర రూ.92.15. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94, డీజిల్ ధర రూ.90.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75, డీజిల్ రూ.92.32. గౌహతిలో లీటరు పెట్రోల్ ధర రూ.97.19 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.42.

ఇవి కూడా చదవండి

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ శుక్రవారం బ్యారెల్ 82.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. జూన్ నుంచి గల్ఫ్ చమురు ధరలు 6.57 శాతం పెరిగాయి. యుఎస్ క్రూడ్ ఫర్ డెలివరీ (డబ్ల్యుటిఐ) శుక్రవారం బ్యారెల్‌కు స్వల్పంగా పడిపోయి 78.45 డాలర్లకు చేరుకుంది. జూన్ నుంచి అమెరికా ముడి చమురు ధరలు 7 శాతం పెరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
అయ్యా బాబోయ్.. ఆ హీరోయిన్ ఈ అమ్మాయా..?
అయ్యా బాబోయ్.. ఆ హీరోయిన్ ఈ అమ్మాయా..?
కాశీలోని ఆ పురాతన దేవాలయం వెరీవెరీ స్పెషల్.. శివకేశవులకు చిహ్నం..
కాశీలోని ఆ పురాతన దేవాలయం వెరీవెరీ స్పెషల్.. శివకేశవులకు చిహ్నం..
Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్..
Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్..
కళ్ల కింద నల్లటి వలయాలా..? కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి
కళ్ల కింద నల్లటి వలయాలా..? కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి
మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!
మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!