Indian Railways: మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటులో వేరేవాళ్లు కూర్చున్నారా? ఇలా చేయండి
సుదూర రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రైలు ప్రయాణం చేసే ముందు రిజర్వేషన్ చేసుకుంటారు. కానీ కొందరు అన్ రిజర్వ్‌డ్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ సీట్లలో కూర్చుంటున్నారు. వారిని సీట్ ఖాళీ చేయాలని చెప్పినా వాదనకు దిగి గొడవకు దిగుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో వారిదో గొడవ పడకుండా..
సుదూర రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రైలు ప్రయాణం చేసే ముందు రిజర్వేషన్ చేసుకుంటారు. కానీ కొందరు అన్ రిజర్వ్‌డ్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ సీట్లలో కూర్చుంటున్నారు. వారిని సీట్ ఖాళీ చేయాలని చెప్పినా వాదనకు దిగి గొడవకు దిగుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో వారిదో గొడవ పడకుండా నేరుగా టీటీఈకి ఫిర్యాదు చేస్తే వెంటనే సీట్ ఖాళీ చేయిస్తాడు.
మీరు చేసుకున్న రిజర్వేషన్ సీటులో ఎవరైనా కూర్చుంటే వెంటనే 139కి సందేశం పంపాలి. ముందుగా SEAT అని రాసి ఆపై స్పేస్ ఇచ్చి మీ సీట్ నంబర్‌తో రైలు PNR అని రాసి ఆక్రమిత ప్రయాణీకుడు అని రాసి మెసేజ్‌ను సెండ్ చేయాలి. ఈ మెసేజ్ పంపిన క్షణాల్లోనే టీటీఈ వచ్చి మీ సీటును ఖాళీ చేయిస్తాడు. మీరు దాని కోసం ఏమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీరు రైలులో ఏదైనా ఇతర సమస్యను ఎదుర్కొంటే మీరు ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమస్యను నివేదించవచ్చు. 139 మీరు రైలు పీఎన్‌ఆర్ నంబర్ ద్వారా టికెట్ లభ్యతను తనిఖీ చేయవచ్చు. అంతేకాకుండా రైలు వచ్చే సమయం, స్థానం, మొత్తం సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు Railmadt యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి