PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే.. తేదీ ఖరారు!

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమల్లోకి తీసుకువస్తోంది. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా ప్రమాణాస్వీకారం చేసిన మోడీ.. అదే రీతిలో పథకాలను కొనసాగిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్‌ యోజన పథకం ఒకటి. రైతులకు సాయంగా ప్రతి ఏడాది రూ.6000ను అందిస్తోంది.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే.. తేదీ ఖరారు!
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Jun 15, 2024 | 6:56 PM

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమల్లోకి తీసుకువస్తోంది. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా ప్రమాణాస్వీకారం చేసిన మోడీ.. అదే రీతిలో పథకాలను కొనసాగిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్‌ యోజన పథకం ఒకటి. రైతులకు సాయంగా ప్రతి ఏడాది రూ.6000ను అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడతను జూన్ 18న ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

9.3 కోట్ల మంది రైతులకు రూ.20000 కోట్లు

పీఎం కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం కింద, దేశంలోని రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందుతున్నాయి. ఆన్‌లైన్‌ బదిలీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్ము వస్తుంది. ఈ సొమ్మును ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా రైతులకు అందజేస్తారు. 17వ విడతతో దేశవ్యాప్తంగా దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు ఇచ్చే యోచనలో ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ ఇటీవల సంతకం

వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దేశ ప్రధాని నరేంద్రమోడీ ముందుగా రైతులకు పెద్ద కానుకగా ఇచ్చే నిర్ణయంపై సంతకం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతను జూన్ 10, 2024న విడుదల చేయాలనే నిర్ణయంపై ప్రధాని మోదీ సంతకం చేశారు. అప్పటి నుంచి కోట్లాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.2,000 వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నిరీక్షణ జూన్ 18తో ముగియనుంది. వచ్చే వారం వారణాసి పర్యటన సందర్భంగా జూన్ 18, 2024న పీఎం కిసాన్ యోజన 17వ విడతను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. అంటే వచ్చే వారం మంగళవారం నాడు రైతుల బ్యాంకు ఖాతాలకు పీఎం కిసాన్ సొమ్ము చేరనుంది. రైతులు ముందుగా పీఎం కిసాన్‌లో తమ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ జాబితాలో మీ పేరును తనిఖీ చేయండిలా..

1 . ముందుగా పీఎం కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత మీరు ‘నో యువర్ స్టేటస్’ ఎంపికపై క్లిక్ చేయాలి.

3. దీని తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.

4. అప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్‌పై ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను కూడా నమోదు చేయాలి.

5. దీని తర్వాత, మీరు మొత్తం సమాచారాన్ని పూరించిన వెంటనే, మీరు ‘వివరాలను పొందండి’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.

6. మీరు దీన్ని చేసిన వెంటనే మీ స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనితో మీరు తదుపరి విడత ప్రయోజనాన్ని పొందగలరో లేదో తనిఖీ చేయవచ్చు.

ఈ రైతులకు పీఎం కిసాన్ ప్రయోజనం లేదు

రైతు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటే అతనికి పీఎం కిసాన్‌ సాయం అందదు. ఆ భూమి రైతు పేరు మీద ఉండాలి. పీఎం కిసాన్‌లో భూమిపై యాజమాన్యం అవసరం. అదే సమయంలో భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందలేరు. అలాగే రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే ఈ పథకం ప్రయోజనం పొందలేరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి