Gold loan tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా వడ్డీ ఆదా..

అత్యవసర సమయంలో డబ్బులు కావాలంటే గోల్డ్ రుణాలు తీసుకోవడం చాలా మంచిది. వీటికి వడ్డీరేటు తక్కువగా ఉండడంతో పాటు వేగంగా రుణం మంజూరవుతుంది. వడ్డీ తక్కువగా ఉండడం వల్ల డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈఎంఐలు కూడా అందుబాటులో ఉంటాయి. బంగారంపై రుణాలు తీసుకోవడానికి మెరుగైన క్రెడిట్ స్కోర్ అవసరం ఉండదు.

Gold loan tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా వడ్డీ ఆదా..
Gold Loan
Follow us

|

Updated on: Jun 15, 2024 | 7:03 PM

ప్రతి ఒక్కరూ తమకొచ్చే ఆదాయం, ఖర్చుల ఆధారంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు. అవి పోను మిగిలే ఆదాయాన్ని బట్టి పొదుపు పథకాలను నిర్వహిస్తారు. అయితే ఒక్కోసారి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి అప్పు చేయాల్సి వస్తుంది. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పు చేస్తే వడ్డీలు బాగా ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో గోల్డ్ లోన్లు ఉపయోగంగా ఉంటాయి.

గోల్డ్ లోన్ తీసుకుంటే..

అత్యవసర సమయంలో డబ్బులు కావాలంటే గోల్డ్ రుణాలు తీసుకోవడం చాలా మంచిది. వీటికి వడ్డీరేటు తక్కువగా ఉండడంతో పాటు వేగంగా రుణం మంజూరవుతుంది. వడ్డీ తక్కువగా ఉండడం వల్ల డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈఎంఐలు కూడా అందుబాటులో ఉంటాయి. బంగారంపై రుణాలు తీసుకోవడానికి మెరుగైన క్రెడిట్ స్కోర్ అవసరం ఉండదు. అలాగే ఈ కింది చిట్కాలను పాటించి గోల్డ్ రుణాలను మరింత తక్కువ వడ్డీకి పొందవచ్చు.

వడ్డీరేట్ల పరిశీలన..

బంగారంపై ఇచ్చే రుణాలకు వసూలు చేస్తున్న వడ్డీరేటును పరిశీలించడం చాలా ముఖ్యం. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ లు, ఆన్‌లైన్ రుణదాతల మధ్య వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. వీటిలో స్వల్ప వ్యత్సాసం ఉన్నా అది దీర్ఘకాల రుణ చెల్లింపులో నష్టం కలిగిస్తుంది.

ఇతర నిబంధనలు..

వడ్డీరేటుతో పాటు ఇతర నిబంధనలను తెలుసుకోవడం అవసరం. రుణ మొత్తం పెద్దదైతే ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదించాలి. వడ్డీ రేటు స్థిరంగా ఉందా, లేదా వేరియబులా అని తనిఖీ చేయండి. స్థిరమైన రేట్లు రుణ కాల వ్యవధిలో ఒకేలా ఉంటాయి. వేరియబుల్ రేట్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.

చెల్లింపులు..

రుణాన్ని తీసుకోవడంతో పాటు దానిని తిరిగి సక్రమంగా చెల్లించడం చాలా ముఖ్యం. దీనికోసం రుణగ్రహీత తన ఆర్థిక పరిస్థితి ఆధారంగా నెలవారీ వాయిదాలను ఎంపిక చేసుకోవాలి. తన ఆర్థిక స్థిరత్వం, ఆదాయ సామర్థ్యాలను అంచనా వేసుకుని ఈఎమ్ ఐల నిర్ణయం తీసుకోవాలి.

ప్రాసెసింగ్ ఫీజులు..

రుణాలకు సంబంధించిన ప్రోసెసింగ్ ఫీజులు, ఇతర ఖర్చుల గురించి తెలుసుకోండి. కొన్నిసార్లు మీనుంచి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అప్లికేషన్, ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులతో పాటు ముందస్తు చెల్లింపు జరిమానాలు ఉండవచ్చు.

ముందస్తు చెల్లింపులు..

ముందస్తు చెల్లింపుల ఆప్షన్ ను తప్పనిసరిగా ఎంపిక చేసుకోండి. దీనివల్ల మీకు సాధ్యమైనప్పుడు లోన్‌ను పాక్షికంగా, లేదా పూర్తిగా ముందస్తుగా చెల్లించే అవకాశం ఉంటుంది. తద్వారా వడ్డీ గణనీయంగా తగ్గుతుంది. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోకపోతే రుణాలను ముందస్తు చెల్లించినందుకు జరిమానా విధించవచ్చు. జరిమానా లేకుండా ముందస్తు చెల్లింపులను అనుమతి ఉంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అదనపు చెల్లింపులు జరపవచ్చు. దీని వల్ల మీ రుణ కాల వ్యవధితో పాటు వడ్డీ కూడా బాగా తగ్గుతుంది.

రీఫైనాన్స్..

ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకు విధానాలు, మార్కెట్ డిమాండ్ తదితర వాటి ఆధారంగా వడ్డీ రేట్లు మారవచ్చు. ఈ మార్పులపై నిఘా ఉంచడం ద్వారా, రేట్లు అనుకూలంగా ఉన్నప్పుడు మీ లోన్‌ని రీఫైనాన్స్ చేయవచ్చు. అంటే ఇప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించడానికి, తక్కువ వడ్డీ రేటుతో కొత్త రుణాన్ని తీసుకోవచ్చు.

సకాలంలో చెల్లింపు..

ఆలస్య రుసుములు, ఇతర చార్జీలను నివారించడానికి రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం మంచిది. లోన్ రీపేమెంట్ గడువు తేదీని గుర్తించుకోవడానికి ఆటోమేటిక్ పేమెంట్లు, రిమైండర్‌లను సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చెల్లింపు చేయడంలో ఇబ్బంది ఉంటే, మీ రుణదాతను సంప్రదించండి. చాలా మంది రుణదాతలు మీరు ట్రాక్‌లో ఉండేందుకు ప్రోగ్రామ్‌లు, ప్రత్యామ్నాయ రీపేమెంట్ షెడ్యూల్‌ను అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం..
పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం..
నారింజతొక్కే కదా అని తీసిపారేయకండి..ఇలా వాడితే గుండె జబ్బులకుచెక్
నారింజతొక్కే కదా అని తీసిపారేయకండి..ఇలా వాడితే గుండె జబ్బులకుచెక్
దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
డిప్యూటీ స్పీకర్ ఎవరు..? సమీకరణాలపై అధినేతల కసరత్తు
డిప్యూటీ స్పీకర్ ఎవరు..? సమీకరణాలపై అధినేతల కసరత్తు
బ్యూటీ పార్లర్‌తో పనిలేదు ఇంట్లోనే ఫేషియల్ గ్లో..! ఈ టిప్స్‌ తో
బ్యూటీ పార్లర్‌తో పనిలేదు ఇంట్లోనే ఫేషియల్ గ్లో..! ఈ టిప్స్‌ తో
ఒకప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఒకప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
అబ్బో..! హెబ్బా అందాలు హీటు పుట్టిస్తున్నాయిగా..
అబ్బో..! హెబ్బా అందాలు హీటు పుట్టిస్తున్నాయిగా..
మా నాన్నకు నేను అలా చేయడం ఇష్టం లేదు..
మా నాన్నకు నేను అలా చేయడం ఇష్టం లేదు..
చియా సీడ్స్‌ తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే..
చియా సీడ్స్‌ తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే..
వర్షాకాలాన్ని అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ
వర్షాకాలాన్ని అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ