AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata EVs: టాటా నుంచి ఎలక్ట్రిక్ కార్ల క్యూ.. మార్కెట్లో లాంచ్ కానున్న ఈవీలు ఇవి..

టాటా కంపెనీకి ప్రస్తుతం రెండు ఈవీ షోరూమ్ లు ఉన్నాయి. వాటిని 50కి పెంచాలని కంపెనీ యోచిస్తుంది. అలాగే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను కూడా బాగా పెంచనుంది. 2030 నాటికి 10 వేల నుంచి లక్షకు పెంచటానికి ప్రణాళికలు రూపొందించింది. అవిన్య ప్రీమియం ఈవీలోకి ప్రవేశించడానికి జేఎల్ఆర్ కు చెందిన ఈఎంఏ ప్లాట్‌ఫాం సహకరించింది. అలాగే అవిన్య కాన్సెప్ట్ వెర్షన్ ను 2022 ఆటో షోలో ప్రదర్శించారు.

Tata EVs: టాటా నుంచి ఎలక్ట్రిక్ కార్ల క్యూ.. మార్కెట్లో లాంచ్ కానున్న ఈవీలు ఇవి..
Tata Ev
Madhu
|

Updated on: Jun 15, 2024 | 7:32 PM

Share

ఎలక్ట్రిక్ కార్ల వినియోగం దేశంలో క్రమంగా పెరుగుతోంది. వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అధునాతన ఫీచర్లు, స్లైలిష్ లుక్, మంచి రేంజ్, అందుబాటులో ధరలతో ఈవీ కార్లు ఆకట్టుకుంటున్నాయి. వీటికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అనేక కంపెనీలు ఉత్పత్తులు పెంచాయి. ఇప్పటికే అనేక ఈవీ కార్లు దేశంలోని రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. మరికొన్ని త్వరలో సందడి చేయనున్నాయి.

టాటా మోటార్స్ నుంచి..

టాటా మోటార్స్ కూడా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు)ను విడుదల చేయనుంది. కర్వ్, హేరియర్, సియోర్రా, అవిన్య ఎలక్ట్రిక్ వాహనాల రోల్ అవుట్‌ను ప్రకటించింది. వీటిలో కర్వ్, హేరియర్ కార్లు 2025లో, అవిన్య, సియోర్రా కార్లు 26లో విడుదల కానున్నాయి.

చార్జింగ్ పాయింట్ల విస్తరణ..

టాటా కంపెనీకి ప్రస్తుతం రెండు ఈవీ షోరూమ్ లు ఉన్నాయి. వాటిని 50కి పెంచాలని కంపెనీ యోచిస్తుంది. అలాగే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను కూడా బాగా పెంచనుంది. 2030 నాటికి 10 వేల నుంచి లక్షకు పెంచటానికి ప్రణాళికలు రూపొందించింది. అవిన్య ప్రీమియం ఈవీలోకి ప్రవేశించడానికి జేఎల్ఆర్ కు చెందిన ఈఎంఏ ప్లాట్‌ఫాం సహకరించింది. అలాగే అవిన్య కాన్సెప్ట్ వెర్షన్ ను 2022 ఆటో షోలో ప్రదర్శించారు. ఈ బ్రాండ్‌తో టాటా పలు కార్లను విడుదల చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

షోరూమ్ పెంపు..

టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను విస్తరిస్తోంది. దశల వారీగా రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న రెండింటిని దాదాపు 50 కి పెంచనుంది. చార్జింగ్ విధానాన్ని కూడా మరింత అందుబాటులోకి తీసుకురానుంది. పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల సంఖ్యను 10 వేల నుంచి ఎఫ్ వై 30 నాటికి 100,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి అదనంగా కమ్యూనిటీ చార్జింగ్ పాయింట్లు 4,300 నుంచి 100,000 వరకూ కంపెనీ పెంచనుందని మార్కెట్ నిపుణుల అంచనా.

లేటెస్ట్ టెక్నాలజీ..

ఈవీల రూపకల్పనలో టాటా మోటార్స్ కూడా కొత్త టెక్నాలజీ వాడనుంది. ఈవీలను సోలార్ రూఫ్‌టాప్‌లతో బండిల్ చేయాలని ఆలోచిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. జేఎల్ఆర్, అగర్తాస్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్, టాటా పవర్ తదితర గ్రూప్ కంపెనీలతో సంస్థకు సహాయ, సహకారాలు అందుతున్నాయి. వీటి ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అందుతోంది.

అనేక చర్యలు..

ముఖ్యంగా జేఎల్ఆర్ నుంచి వచ్చిన ఈఎమ్ఏ ఫ్లాట్ ఫాం కొత్త అవిన్యకు ఎంతో మద్దతుగా నిలుస్తోంది. తద్వారా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈవీ మార్కెట్ లోకి టాటా మోటార్స్ వేగవంతంగా ప్రవేశించేందుకు దోహదపడుతోంది. ఈవీల ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు టాటా మోటార్స్ చర్యలు చేపట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..