AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి గుడ్ న్యూస్.. అది లేకపోయినా నో ప్రాబ్లమ్..

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి దారులకు శుభవార్త చెప్పింది. గతంలో చెప్పని విధంగా నామినేషన్ లేకపోతే ఖాతాలను స్తంభింపజేస్తామన్న విషయాన్ని వెనకకు తీసుకుంది. నామినేషన్ లేకపోయినా డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు ఆగవని హామీ ఇచ్చింది.

SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి గుడ్ న్యూస్.. అది లేకపోయినా నో ప్రాబ్లమ్..
Mutual Fund Investing
Madhu
|

Updated on: Jun 15, 2024 | 9:04 PM

Share

మ్యూచువల్ ఫండ్స్ కు ప్రజల ఆదరణ పెరుగుతోంది. వాటిలో పెట్టుబడి పెట్టడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటూ పెట్టుబడులు పెడుతున్నారు. అయితే డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ కు నామినేషన్ తప్పనిసరి అని సెబీ గతంలో ప్రకటించింది. నామినీ పేరు చేర్చడం లేదా నామినేషన్ ఇష్టం లేదని ప్రకటించడంపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. దానికి ఈ ఏడాది జూన్ 30 తేదీని గడువుగా విధించింది. ఆ లోపు నామినేషన్ చేయకపోతే ఆయా ఖాతాలను స్తంభిస్తామని హెచ్చరించింది.

నిర్ణయం వెనుకకు..

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి దారులకు శుభవార్త చెప్పింది. గతంలో చెప్పని విధంగా నామినేషన్ లేకపోతే ఖాతాలను స్తంభింపజేస్తామన్న విషయాన్ని వెనకకు తీసుకుంది. నామినేషన్ లేకపోయినా డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు ఆగవని హామీ ఇచ్చింది. నామినేషన్ ఎంపిక అందించడంలో విఫలమైనా ఖాతాలు కొనసాగుతాయని తెలిపింది.

ఖాతాదారులకు ఊరట..

సెబీ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. భౌతిక రూపంలో సెక్యూరిటీలను కలిగి ఉన్న పెట్టుబడిదారులు డివిడెండ్, వడ్డీ, రిడెంప్షన్ చెల్లింపులను ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వీకరించవచ్చు. అలాగే ఆర్టీఏ నుంచి సేవా అభ్యర్థనను పొందేందుకు, చెల్లింపును స్వీకరించడానికి కూాడా అర్హులే. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు, యూనిట్ హోల్డర్లు తమ నామినేషన్ ఎంపికను సమర్పించకపోయినా ఇబ్బంది లేదు. వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు ఆగిపోవు. కాగా.. నామినేషన్ ఎంపిక సమర్పించనందుకు లిస్టెడ్ కంపెనీలు, ఆర్టీఏలు ప్రస్తుతం నిలిపివేసిన చెల్లింపులను తదనుగుణంగా ప్రాసెస్ చేస్తాయి.

వీరికి తప్పనిసరి..

ఉమ్మడిగా నిర్వహించే డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు మినహాయించి కొత్త పెట్టుబడి దారులందరూ నామినేషన్ తప్పనిసరిగా అందజేయాలి.

అవగాహన కల్పించాలి..

డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్ యూనిట్‌ హోల్డర్లను నామినేషన్ అప్ డేట్ చేయడానికి ప్రోత్సహించాలని రెగ్యులేటర్ డిపాజిటరీ పార్టిసిపెంట్లు, ఏఎంసీలు, ఆర్టీఏలను సెబీ కోరింది. ఇందులో భాగంగా అక్టోబర్ ఒకటి నుంచి వారందరికీ ఇమెయిల్స్, ఎస్ఎమ్ఎస్ లు పంపాలని ఆదేశించింది. డీమ్యాట్ ఖాతా, ఎంఎఫ్ ఫోలియోలు రెండింటిలోనూ నామినేషన్ కోసం లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి ఒక ఫార్మాట్‌ను సెబీ అందించింది. వివరాలను నమోదు చేసినప్పుడు నామినీ పేరు, నామినీ వాటా, దరఖాస్తుదారుతో సంబంధం తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కోరింది.

నామినేషన్ ఎందుకు ముఖ్యమంటే..

మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ చేయడం అనేది చాలా అవసరం. దురదృష్టవశాత్తూ పెట్టుబడిదారుడు మరణిస్తే అతడి సొమ్మను వారసులకు అందించడానికి వీలుంటుంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా లీగల్ గా బదిలీ చేయవచ్చు. వారసత్వానికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను నివారించడంలో నామినేషన్ సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..