AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HRA Claim: అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే.. లేకుంటే నష్టపోతారు..

సాధారణంగా అద్దెను నగదు రూపంలో చెల్లిస్తారు. మీ ఇంటి యజమాని ఆదాయపు పన్ను పరిధిలోకి రాకుంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ మీ ఇంటి యజమాని తన ఆదాయంలో ఇంటి నుంచి వచ్చిన అద్దెను చూపించకపోవచ్చు. పన్ను నుంచి తప్పించుకోవడానికి ఐటీఆర్ లో అద్దె ఆదాయం చెప్పకపోవచ్చు. అలాగా మీరు చెల్లించే ఇంటి అద్దెకు రశీదులు లేకపోతే సమస్యలు ఎదురవుతాయి.

HRA Claim: అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే.. లేకుంటే నష్టపోతారు..
Tax
Madhu
|

Updated on: Jun 15, 2024 | 8:02 PM

Share

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేయడం చాలా కీలకం. దీనిలో ఆ ఏడాదికి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలను వెల్లడించాలి. వాటి ప్రకారం పన్ను నుంచి మినహాయింపులు లభిస్తాయి. ఆదాయపు పన్నుదారులు తాము చెల్లించే ఇంటి అద్దెను (హెచ్ఆర్ఏ) కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను నుంచి ఈ మొత్తానికి మినహాయింపు లభిస్తుంది. అయితే రశీదులు లేకుండా నగదు రూపంలో అద్దె చెల్లించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సమస్యలు..

సాధారణంగా అద్దెను నగదు రూపంలో చెల్లిస్తారు. మీ ఇంటి యజమాని ఆదాయపు పన్ను పరిధిలోకి రాకుంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ మీ ఇంటి యజమాని తన ఆదాయంలో ఇంటి నుంచి వచ్చిన అద్దెను చూపించకపోవచ్చు. పన్ను నుంచి తప్పించుకోవడానికి ఐటీఆర్ లో అద్దె ఆదాయం చెప్పకపోవచ్చు. అలాగా మీరు చెల్లించే ఇంటి అద్దెకు రశీదులు లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఈ కారణాలతో మీ హెచ్ ఆర్ఏ క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు..

వినాయక్ అనే ఉద్యోగి ప్రతి నెలా అద్దెగా రూ. 20 వేలు చెల్లిస్తాడు. దానిలో సగం నగదు, మిగిలింది ఆన్ లైన్ లో బదిలీ చేశాడు. ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు అతను ఏడాదికి అద్దె రూపంలో చెల్లించిన రూ. 2.4 లక్షలను హెచ్ఆర్ఏ మినహాయింపుగా క్లెయిమ్ చేశాడు. కానీ అతడికి మినహాయింపు లభించలేదు. ఎందుకంటే ఇంటి యాజమాని తాను పొందే అద్దె కేవలం రూ. 1.2 లక్షలు (నెలకు 10 వేలు) మాత్రమే అని నివేదించాడు. దాని వల్ల అనుకున్న దానికన్నా వినాయక్ ఎక్కువ పన్నుచెల్లించాల్సి వచ్చింది.

నిబంధనలు..

పన్ను నిపుణుల చెప్పన వివరాల ప్రకారం అద్దెను నగదు రూపంలో ఇంటి యజమానులకు చెల్లించవచ్చు. అయితే వారు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీలోని నిబంధనలను అనుసరించాలి. దాని ప్రకారం రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడం నిషేధం. యజమానులు అద్దె ఆదాయాన్ని సెక్షన్ 269 ఎస్టీలో పేర్కొన్న పరిమితుల వరకు మేరకు అంగీకరించవచ్చు. కానీ వారు ఈ అద్దెను తమ ఆదాయంలో చూపించాలి.

చాలా అవసరం..

అద్దెను నగదు రూపంలో మాత్రమే అంగీకరించే యజమానులు ఈ ఆదాయాన్ని పన్ను కోసం ప్రకటించరు. అలాగే వారి పాన్ నంబర్‌ను మీకు ఇవ్వడానికి ఇష్టపడరు. మీ వార్షిక అద్దె రూ. 1 లక్ష దాటితే మీకు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడానికి యజమాని పాన్ నంబర్ అవసరం.

రుజువులు..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10 (13ఏ) కింద హెచ్ఆర్ఏ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అద్దె చెల్లింపు రుజువును అందించాలి. అద్దె రశీదులు, యజమాని పాన్ నంబర్ ఇందుకు అవసరమవుతాయి. ఒకవేళ యజమాని పాన్ నంబర్ లేకున్నా మీవద్ద అద్దె రశీదులు ఉంటే వాటిని ఆధారంగా చూపి క్లయిమ్ చేసుకోవచ్చు.

ఇంటి యజమానులు అద్దెను నగదు రూపంలో తీసుకుని, దానిని తమ ఐటీఆర్ లో చూపకపోతే వారు ఎదుర్కొనే పరిణామాలు ఇలా ఉంటాయి.

బెస్ట్ జడ్జిమెంట్ అసెస్‌మెంట్..

యజమాని ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేయకపోెయినా పన్ను అధికారి తనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పన్ను చెల్లింపుదారు ఆదాయం, పన్ను బాధ్యతను అంచనా వేస్తాడు.

జరిమానా, వడ్డీ..

సెక్షన్ 234ఏ ప్రకారం పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను సకాలంలో చెల్లించకపోతే, వారు బకాయి ఉన్న పన్నుపై నెలకు ఒకశాతం వడ్డీని చెల్లించాలి. ముందస్తు పన్ను చెల్లింపులో జాప్యం జరిగితే సెక్షన్ 234బీ కింద వడ్డీ విధిస్తారు.

ప్రాసిక్యూషన్..

ఇలా మోసం చేసిన యజమానులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఆదాయపు పన్ను బాధ్యత రూ. 25 వేలు దాటితే, ఐటీఆర్‌ను అందించడంలో విఫలమైతే ప్రాసిక్యూషన్‌కు దారి తీస్తుంది. ఈ నేరానికి కనీసం 6 నెలల నుంచి ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తారు. పన్ను బాధ్యత రూ. 25 వేల కంటే తక్కువగా ఉన్న సందర్భాలలో శిక్ష కనీసం 3 నెలల నుంచి రెండేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..