Bank Holiday: కస్టమర్లకు అలర్ట్.. జూన్ 17న బ్యాంకులు బంద్.. కారణం ఏంటంటే..
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సోమవారం బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు జాబితా ప్రకారం, భారతదేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సోమవారం, జూన్ 17, 2024న బక్రీద్ సందర్భంగా మూసి ఉండనున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవు దినం అన్ని రాష్ట్రాలకు వర్తించవని బ్యాంకు వినియోగదారులు గుర్తించుకోవాలి. ఇప్పటికే..

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సోమవారం బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు జాబితా ప్రకారం, భారతదేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సోమవారం, జూన్ 17, 2024న బక్రీద్ సందర్భంగా మూసి ఉండనున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవు దినం అన్ని రాష్ట్రాలకు వర్తించవని బ్యాంకు వినియోగదారులు గుర్తించుకోవాలి. ఇప్పటికే జూన్ నెల సగం రోజులు గడిచిపోయాయి. నెల ముగియడానికి ఇంకా మరో సగం రోజులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయి అనే జాబితాను విడుదల చేస్తుంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండగలు, జయంతి, వర్థంతిలు, ఇతర కార్యక్రమాలను బట్టి బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్న కూడా ఆన్‌లైన్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. వాటిలో ఎలాంటి అంతరాయం ఉండదు.
సోమవారం ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయంటే..
మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అన్ని ఇతర రాష్ట్రాల్లో, ఈద్-ఉల్-అధా సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ బ్యాంకు సెలవుల జాబితా:
- 18 జూన్ 2024: బక్రీ ఈద్ కారణంగా జమ్ము -శ్రీనగర్ జోన్‌లలో బ్యాంకులు బంద్.
- 22 జూన్ 2024: నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.
- 23 జూన్ 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు.
- 30 జూన్ 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








