Ather Rizta: ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్ వచ్చేస్తోంది.. తమిళనాడులో తయారీ ప్రారంభం..
వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభమైంది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న కంపెనీ తయారీ కేంద్రంలో వీటిని మొదలుపెట్టారు. ఇక్కడి నుంచే మొదటి బ్యాచ్ యూనిట్లు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదలవుతూనే ఉన్నాయి. సంప్రదాయ పెట్రోలు వాహనాలకు బదులుగా వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్రముఖు కంపెనీలు కూడా వీటి ఉత్పత్తిని ప్రారంభించాయి.
ఏథర్ రిజ్టా ఉత్పత్తి ప్రారంభం..
వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభమైంది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న కంపెనీ తయారీ కేంద్రంలో వీటిని మొదలుపెట్టారు. ఇక్కడి నుంచే మొదటి బ్యాచ్ యూనిట్లు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఏథర్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ స్కూటర్ పై ప్రయాణం సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉంటుందని తెలిపింది.
ఏడు రంగులలో..
ఈ ఏడాది ప్రారంభలో అథర్ రిజ్టా ధరను రూ. 1.10 లక్షలుగా (ఎక్స్ షో రూమ్) నిర్ణయించారు. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో ఏడు రంగులలో అందుబాటులో అందుబాటులో ఉంది. భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఏథర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏథర్ 450 ఎస్,450 ఎక్స్ అపెక్స్ లు ప్రజల ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఏథర్ రిజ్టా పూర్తి కొత్త డిజైన్ తో మార్కెట్ లోకి వస్తుంది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి వాటికి ప్రధాన పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.
ధర వివరాలు..
ఏథర్ రిజ్టా ఏప్రిల్ లో రూ.1.10 లక్షల ప్రారంభ ధరతో భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సుమారు రూ.1.46 లక్షల వరకూ ఉంటుంది (ఎక్స్ షోరూమ్). దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన మోడళ్లపై వర్తించే విధంగా వివిధ సబ్సిడీలను పొందవచ్చు.
మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్..
ఏథర్ రిజ్టా లో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ను ఏర్పాటు చేశారు. వీటి రేంజ్ కూడా మారుతూ ఉంటుంది. రిజ్టా లోని ప్రముఖ మోడల్ వెర్షన్ 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 105 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుంది. దీనికంటే పెద్దదైన 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ దాదాపు 125 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.
ప్రత్యేకతలు ఇవే..
ఏథర్ రిజ్టా కేవలం 3.7 సెకన్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అలాగే గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు పరిగెడుతుంది. దీనిలో టీఎఫ్టీ టచ్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్ బై టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మోనో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టైల్‌లైట్లు, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అతిపెద్ద సీటును ఏథర్ రిజ్టాకే ఉంది. అలాగే పూర్తిగా కొత్త డిజైన్ తో మార్కెట్ లోకి వస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ వన్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రధాన పోటీ దారుగా మారింది. అలాగే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి పెట్రోల్ పవర్డ్ మోడళ్లకూ పోటీగా తయారైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




