నువ్వు సూపర్ తాత.. 78 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నాడు

పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమే అని పలువురు నిరూపిస్తుంటారు. అలాంటి కోవలోకే చెందుతాడు ఈ 78 సంవత్సరాల వయసున్న తాత. తన భుజానికి స్కూల్ బ్యాగు వేసుకుని, యునిఫాం ధరించి ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తున్నాడు. అదేంటి ఆ వయసులో కూడా స్కూల్‌కి వెళ్లడం ఏంటని అనేగా మీరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

నువ్వు సూపర్ తాత.. 78 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నాడు
Lalringthara
Follow us
Aravind B

|

Updated on: Aug 03, 2023 | 3:38 PM

పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమే అని పలువురు నిరూపిస్తుంటారు. అలాంటి కోవలోకే చెందుతాడు ఈ 78 సంవత్సరాల వయసున్న తాత. తన భుజానికి స్కూల్ బ్యాగు వేసుకుని, యునిఫాం ధరించి ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తున్నాడు. అదేంటి ఆ వయసులో కూడా స్కూల్‌కి వెళ్లడం ఏంటని అనేగా మీరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలో హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్‌రింగ‌థర అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. తన గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్ – మయన్మార్ సరిహద్ధుల్లో ఖువాంగ్‌లెంగ్ అనే గ్రామంలో లాల్‌రింగథర జన్మించాడు. అయితే తన చిన్నతనంలోనే అతని తండ్రి మరణించాడు. దీంతో లాల్ 2వ తరగతిలోనే చదువును వదిలేయాల్సి వచ్చింది. వాళ్ల ఇంటిలో అతనొక్కడే సంతానం కావడంతో తల్లితో పాటు కూలి పనులకు వెళ్తు జీవనం సాగించాడు.

ఉపాధి కోసం ఒక చోట నుంచి మరో ప్రాంతానికి మారి.. చివరకి 1995లో న్యూ హువాయికాన్ అనే గ్రామంలో స్థిరపడ్డాడు. వయసు అయిపోయాక కూడా జీవనం కోసం స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన ఆర్థిక పరిస్థితుల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతడ్ని వెంటాడింది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా నైపుణ్యం సంపాదించాలని.. ఆ భాషలో వివిధ దరఖాస్తులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందకోసమే ఈ వయసులో కూడా పాఠశాలలో చేరాడు. అయితే ఇటీవల లాల్ ఓ మీడియాతో మాట్లాడారు. నాకు మిజో భాష చదవడం, రాయడంలో సమస్య లేదని.. కాని చదువుకోవాలని కోరిక ఉందని చెప్పాడు. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆంగ్లపదాలే కనిపిస్తున్నాయని.. వాటిని చదివేందుకు ఇబ్బంది పడుతుంటానని తెలిపాడు. అందుకోసమే తాను ఆంగ్ల భాషను ఎలాగైనా నేర్చుకోవాలనే ఆశతో ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పాడు. మరో విషయం ఏంటంటే లాల్‌రింగథర ఇంటి నుంచి పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే లాల్ ప్రతిరోజూ తన ఇంటి నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు.

ఇవి కూడా చదవండి