India Post GDS Recruitment 2023: నిరుద్యోగులకు బంపరాఫర్.. టెన్త్ అర్హతతో తపాలా శాఖలో 30,041 ఉద్యోగాలు. ఎలాంటి రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న.. 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1058 , తెలంగాణలో 961 వరకు ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగం కేటాయిస్తారు. అంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదన్న..
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న.. 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1058 , తెలంగాణలో 961 వరకు ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగం కేటాయిస్తారు. అంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఎంపికైతే పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు జీతంగా చెల్లిస్తారు. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేయవల్సి ఉంటుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ అందిస్తారు. ఆ సేవలకు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. ఐతే సంబంధిత పోస్టల్ శాఖ కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరితేదీగా ఆగస్టు 23, 2023ని నిర్ణయించారు. దరఖాస్తు చేసేటప్పుడు జనరల్ అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు.
ఏయే అర్హతలు ఉండాలంటే..
మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైతే చాలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో పది పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి సబ్జెక్టుల్లో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివుండాలన్నమాట. అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతిలో వచ్చిన మార్కులు, స్థానికత, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్/ఈమెయిల్/పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు.
జీతభత్యాలు ఎలా ఉంటాయంటే..
ఎంపికైన వారికి బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000ల నుంచి రూ.29,380ల వరకు చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల వరకు జీతంగా చెల్లిస్తారు.
సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు..
- ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 1058
- అసోం ఖాళీలు: 855
- బీహార్ ఖాళీలు: 2300
- ఛత్తీస్‌గఢ్ ఖాళీలు: 721
- ఢిల్లీ ఖాళీలు: 22
- గుజరాత్ ఖాళీలు: 1850
- హరియాణా ఖాళీలు: 215
- హిమాచల్ ప్రదేశ్ ఖాళీలు: 418
- జమ్ము & కశ్మీర్ ఖాళీలు: 300
- ఝార్ఖండ్ ఖాళీలు: 530
- కర్ణాటక ఖాళీలు: 530
- కేరళ ఖాళీలు: 1508
- మధ్యప్రదేశ్ ఖాళీలు: 1565
- మహారాష్ట్ర ఖాళీలు: 3154
- నార్త్ ఈస్టర్న్ ఖాళీలు: 500
- ఒడిశా ఖాళీలు: 1279
- పంజాబ్ ఖాళీలు: 336
- రాజస్థాన్ ఖాళీలు: 2031
- తమిళనాడు ఖాళీలు: 2994
- తెలంగాణ ఖాళీలు: 961
- ఉత్తర ప్రదేశ్ ఖాళీలు: 3084
- ఉత్తరాఖండ్ ఖాళీలు: 519
- పశ్చిమ్ బెంగాల్ ఖాళీలు: 2127
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.