Watch Video: వామ్మో ఇలా కూడా వస్తారా.. ట్రాక్టర్ తోలుకుంటూ కాలేజ్‌కు వచ్చిన విద్యార్థి.. వీడియో వైరల్
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రతిఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్‌ను వాడకుండా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి వచ్చేసింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కొంచెం వింతగా కనిపిస్తే చాలు అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి.

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రతిఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్‌ను వాడకుండా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి వచ్చేసింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కొంచెం వింతగా కనిపిస్తే చాలు అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఎవరైనా ఎదైన కొత్తగా, అందరికి ఆశ్చర్యపరిచేలా చేస్తే నెట్టింటా ఆ వీడియో గురించే చర్చ నడుస్తుంది. మరికొందరైతే సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ వీడియోల్లో మనకు ఫన్నీగా కనిపించేవి ఉంటాయి, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవి ఉంటాయి. మరికొన్ని ఇన్‌స్పిరేషనల్‌గా, అవగాహన కల్పించేవి, విన్యాసాలు చేసేవి కూడా దర్శనిమిస్తాయి. ఈ వీడియోల్లో ఎక్కువగా యువత చేసే పనులు కొన్ని నవ్వులు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
సాధారణంగా అందరు విద్యార్థులు స్కూలు, కాలేజీలకు బస్సుల్లో, ఆటోల్లో వస్తుంటారు. మరికొందరు సైకిల్, బైకుల మీద కూడా వస్తుంటారు. కానీ ఓ విద్యార్థి మాత్రం కాలెజ్‌కు వచ్చిన తీరును చూసి అందరు ఆశ్యర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం నల్లూరులోని జయరాజ్ అన్నపాకియం కళాశాలలో ఓ విద్యార్థి చదువుకుంటున్నాడు. అతడు ఏకంగా ట్రాక్టర్ మీదే స్కూల్‌కు వచ్చేశాడు. ట్రాక్టర్‌ను ముఖ్యంగా వ్యవసాయ పనల్లో, ఇంకా ఇతర పనులకు వాడుతారు. కానీ ఆ విద్యార్థి అలా ట్రాక్టర్ మీద పాఠశాలకు రావడంతో అందరు అవాక్కయ్యారు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ ట్రాక్టర్ తొలుకుంటూ బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటీజన్లు విభిన్న రీతుల్లో కామెంట్లు చేస్తున్నారు. ఎవరు బాబు నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని ఒకరు.. ట్రాక్టర్ మీద ఎలివేషన్స్ ఇచ్చావు.. నువ్వు తోపు తమ్ముడు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.




Tractor esuku vacchesav entra😂😝😜 pic.twitter.com/4KIQxz7P1x
— Poley_Adiripoley (@poleyadiripoley) August 3, 2023
