బ్రేక్ వేస్తే రెండు ముక్కలైన బైక్.. జస్ట్ మిస్.. లేకుంటే పోయేవాడు!!
ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ కార్స్, బైక్స్, స్కూటర్స్ వాడకం జోరుగా సాగుతోంది. పెరిగిన పెట్రోల్ రేట్ల కారణంగా చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తీరా కొన్నాక బాధపడాల్సి వస్తోంది. ఈ మధ్య చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిన వార్తలు చాలానే వస్తున్నాయి. తాజాగా మరో ఎలక్ట్రికల్ బైక్ రన్నింగ్ లో ఉండగానే రెండు ముక్కలైంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి కూడా తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త..

ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ కార్స్, బైక్స్, స్కూటర్స్ వాడకం జోరుగా సాగుతోంది. పెరిగిన పెట్రోల్ రేట్ల కారణంగా చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తీరా కొన్నాక బాధపడాల్సి వస్తోంది. ఈ మధ్య చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిన వార్తలు చాలానే వస్తున్నాయి. తాజాగా మరో ఎలక్ట్రికల్ బైక్ రన్నింగ్ లో ఉండగానే రెండు ముక్కలైంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి కూడా తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన శ్రావణ్ రూ.65 వేలు పెట్టి ఇటీవల ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం కూరగాయాలు తీసుకొచ్చేందుకు శ్రావణ్ మంచిర్యాల మార్కెట్ కు బైక్ పై బయలు దేరాడు. రోడ్డుపై జాలీగా వెళ్తున్నాడు. మార్గ మధ్యలోకి వెళ్లగానే ఓ చోట లైట్ గా బ్రేక్ టచ్ చేశాడు. అంతే హ్యాండిల్ ను బైక్ తో కలిపే ఫార్క్ రన్నింగ్ లో విరిగిపోయింది.




నడిరోడ్డు మీదే బండి రెండు ముక్కలైంది. శ్రావణ్ గాల్లోకి ఎగిరి బండి ముందు పడ్డాడు. మరోవైపు అతని పక్క నుంచి టాటా ఎస్ వాహనం వెళ్తుంది. దీంతో వెంటనే అలర్ట్ అయినా శ్రావణ్.. తన రెండు కాళ్లను ముడిచాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టం ఉండటంతో అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం తేరుకుని శ్రావణ్ లేచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఇదంతా దగ్గర్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
