Road Accident: అదుపు తప్పిన సిమెంట్ ట్యాంకర్.. మొత్తం కుటుంబాన్నే వెంటాడిన మృత్యువు..
Road Accident: ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందగా.. అయితే, వాటి పక్కనే స్కూటీపై వెళ్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Madhya Pradesh Road Accident: ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందగా.. అయితే, వాటి పక్కనే స్కూటీపై వెళ్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలోని మద్వాస్ ప్రాంతం డోల్ గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకన్నట్లు పోలీసులు తెలిపారు. అదుపుతప్పిన సిమెంట్ ట్యాంకర్ జీపును ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో సిమెంట్ ట్యాంకర్, జీపు మధ్య చిక్కుకుని స్కూటీపై వెళ్తున్న వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
సిమెంట్ ట్యాంకర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిందని.. అనంతరం జీపును ఢీకొట్టి దానిపై బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో జీపులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారని.. వారిలో ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరు స్కూటీపై వెళ్తూ మరణించారని పేర్కొన్నారు. మృతులను బారతి రాజారామ్ యాదవ్ (56), సుఖ్‌లాల్ యాదవ్ (55), రోహిత్ యాదవ్ (15), శిబు యాదవ్ (10), మంగళ్ యాదవ్ (19), ధర్మేంద్ర (25), ఇంకొకరు ఆశిష్ శుక్లాగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..