Maharashtra: మహారాష్ట్రలో ఘోర విషాదం.. రేకుల షెడ్డుపై చెట్టు కూలి 7 గురు మృతి
మహారాష్ట్రలోని అకోల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం వల్ల ఓ చిన్న రేకుల షెడ్డుపై చెట్టు పడిపోవడంతో 7 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున అకోల జిల్లా పరాస్ లోని ఓ ఆలయం వద్ద జరుగుతున్న మతపరమైన వేడుకకు చాలామంది భక్తులు హాజరయ్యారు.

మహారాష్ట్రలోని అకోల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం వల్ల ఓ చిన్న రేకుల షెడ్డుపై చెట్టు పడిపోవడంతో 7 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున అకోల జిల్లా పరాస్ లోని ఓ ఆలయం వద్ద జరుగుతున్న మతపరమైన వేడుకకు చాలామంది భక్తులు హాజరయ్యారు. అయితే రాత్రి ఏడు గంటకు ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అయితే అక్కడే ఓ చిన్న రేకుల షెడ్డులో కొంతమంది భక్తులు సేద తీరుతున్నారు. కానీ భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావానికి దాని పక్కనే ఉన్న ఓ పెద్ద వేపచెట్టు ఆ రేకుల షెడ్డుపై పడింది.దీంతో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పడిపోయిన చెట్టును, కూలిన షెడ్డును పైకి లేపేందుకు జేసీబీ మిషన్లను తెప్పించారు. అయితే ఆ చెట్టు పడిపోయినప్పడు ఆ షెడ్డు కింద దాదాపు నలభైమంది ఉన్నారని అందులో 36 మందికి గాయాలయ్యాయని అకోలా జిల్లా కలెక్టర్ నీమ అరోర తెలిపారు. వారిని ఆస్పత్రకి తరలిస్తుండగా నలుగురు చనిపోయారని..ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని ప్రకటించారు. గాయాలపాలైన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..



