Telangana: ఆరిజన్‌ డెయిరీ లైంగిక కథా చిత్రంలో కీలక మలుపు.. ఆధారాలు త్వరలో రివీల్‌ చేస్తానంటోన్న శేజల్‌..

అప్పుడే ఏమైంది! అసలు కథ ముందుంది అంటోంది ఆరిజన్‌ డెయిరీ ఎండీ శేజల్‌. ఎపిసోడ్స్‌ వారీగా ఫొటోలు రిలీజ్‌ చేస్తోన్న శేజల్‌... త్వరలో అసలుసిసలు ఆధారాలు బయటపెడతానంటోంది. టీవీ9 వేదికగా MLA దుర్గం చిన్నయ్యపై సెన్సేషనల్‌ అలిగేషన్స్‌ చేసింది. ఇంతకీ, శేజల్‌ చేసిన ఆ సంచలన ఆరోపణలేంటి?. నెక్ట్స్‌ ఎపిసోడ్‌లో బయటపెట్టబోయే ఆధారాలు కథను ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయ్‌.

Telangana: ఆరిజన్‌ డెయిరీ లైంగిక కథా చిత్రంలో కీలక మలుపు.. ఆధారాలు త్వరలో రివీల్‌ చేస్తానంటోన్న శేజల్‌..
Mla Durgam Chinnaiah
Follow us

|

Updated on: Apr 09, 2023 | 7:52 PM

రోజుకో సంచలన ఆరోపణతో మీడియా ముందుకొస్తోంది శేజల్‌. ఈసారి, టీవీ9 వేదికగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సెన్సేషనల్‌ అలిగేషన్స్‌ చేసింది. ఏకాంతంగా గడపాలని రెండుసార్లు తనను బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. తాను ఒప్పుకోకపోయేసరికి బెదిరించడం మొదలుపెట్టాడని అంటోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశాడని చెబుతోంది. అమ్మాయిల కోసం వేధించడంతో బ్రోకర్లను పరిచయం చేసినట్టు చెప్పింది. ఇవన్నీ తాను బయటపెట్టడంతో చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది శేజల్‌. తాను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పమని టార్చర్‌ చేస్తున్నారంటోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పుకొచ్చింది శేజల్‌. MLA దుర్గం చిన్నయ్య, అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, పోలీసులకు కంప్లైంట్‌చేస్తే రివర్స్‌లో తననే వేధిస్తున్నారని వాపోతోంది.

రీసెంట్‌గా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాట్సప్‌ చాట్‌ను బయటపెట్టింది శేజల్‌. అందులో అమ్మాయిల ప్రస్తావన, అమ్మాయిలతో దిగిన ఫొటోలు ఉండటం సంచలనం రేపింది. మీరే ఎంజాయ్‌ చేస్తారా! మాకేం లేదా! ఆ అమ్మాయి ఉందా అంటూ సాగిన చాటింగ్‌ వైరల్‌గా మారింది. అయితే, అసలు ఆ చాటింగే తనది కాదంటూ కొట్టిపారేశారు దుర్గం చిన్నయ్య. ఇదంతా తనపై జరుగుతోన్న పెద్ద కుట్ర అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రాకుండా చేసేందుకు ప్రత్యర్ధులు ఆడిస్తోన్న గేమ్‌ అంటున్నారు దుర్గం చిన్నయ్య. కానీ, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటోంది శేజల్‌. త్వరలోనే మరిన్ని ఫొటోలు బయటపెడతానంటోంది. మరి, నెక్ట్స్‌ ఎపిసోడ్‌లో ఈ కామ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. ఎలాంటి సంచలనాలు రివీల్ చేస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం