MLA Kethireddy: తాడిపత్రిలో హైటెన్షన్.. ఇక్కడ పాదయాత్ర చేయాలంటే లోకేష్ జాగ్రత్తగా మాట్లాడాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్

తన నియోజక వర్గంలో అడుగు పెట్టనున్న నారా లోకేష్ కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జాగ్రత్తగా నారా లోకేష్ మాట్లాడాలి.. లేకపోతే ఊరుకోనని ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

MLA Kethireddy: తాడిపత్రిలో హైటెన్షన్.. ఇక్కడ పాదయాత్ర చేయాలంటే లోకేష్ జాగ్రత్తగా మాట్లాడాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
Kethireddy Vs Lokesh
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 4:56 PM

తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాటల యుద్ధం మొదలు పెట్టారు. దీంతో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే పాదయాత్ర చేస్తూ.. తన నియోజక వర్గంలో అడుగు పెట్టనున్న నారా లోకేష్ కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జాగ్రత్తగా నారా లోకేష్ మాట్లాడాలి.. లేకపోతే ఊరుకోనని ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే తేల్చుకుంటానని అన్నారు.

టీడీపీ కార్యకర్తలను చంపిన జేసీ బ్రదర్స్ ను ఎందుకు పార్టీ లో ఉంచుకున్నారో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి  జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. నారా లోకేష్ తన పాదయాత్రలో ఏమైనా తేడా మాట్లాడితే..  లోకేష్ బస చేసిన క్యాంపు సైట్ కు వెళ్ళి ప్రశ్నిస్తానని చెప్పారు కేతిరెడ్డి. అంతేకాదు అనవసర ఆరోపణలు చేస్తే.. లోకేష్ పాదయాత్ర తాడిపత్రి దాటి వెళ్ళదని అల్టిమేటం జారీ చేశారు.

జేసీ బ్రదర్స్ అరాచకాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అంతేకాదు తాడిపత్రి టీడీపీ కార్యకర్తలను చంపింది జేసీ బ్రదర్స్ కాదా?  టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్‌ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది. ప్రబోదానందస్వామి ఆశ్రమం పై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేయించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి లోకేష్ కు గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు.  మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ను చంపింది జేసీ బ్రదర్స్ అని పరిటాల సునీత ఆరోపించారు.. ఈరోజు జేసీ ఫ్యామిలీతో పరిటాల కుటుంబం చెట్టాపట్టాలేసుకుని ఎలా తిరుగుతోంది.. అసలు పరిటాల హత్య కు ఉపయోగించిన ఆయుధాలు సరఫరా చేసింది జేసీ బ్రదర్స్ కాదా అంటూ లోకేష్ ను ప్రశ్నించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!