AP BRS: ఏపీలో పోటీ చేసే స్థానాలపై బీఆర్‌ఎస్ క్లారిటీ.. కీలక ప్రకటన..

ఏపీలో బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై కొన్నాళ్లుగా ఫోకస్ పెడుతోంది. అటు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ.. గ్రాఫ్‌ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటు గోదావరి జిల్లాల్లోని కాపులను మచ్చిక చేసుకుంటుంది.

AP BRS: ఏపీలో పోటీ చేసే స్థానాలపై బీఆర్‌ఎస్ క్లారిటీ.. కీలక ప్రకటన..
Thota Chandrasekhar
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2023 | 4:28 PM

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై గులాబీబాస్‌ కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఏపీలో పార్టీని విస్తరించిన కేసీఆర్.. తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో.. ఏపీలోని ఉత్తరాంధ్రపై, గోదావరి జిల్లాలపై తోట చంద్రశేఖర్ ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్‌ చేశారు. తొలిరోజు విశాఖ వేదికగా బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తోట చంద్రశేఖర్ సారథ్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు నినదించాయి. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామన్నారు ఏపీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాటంలో ఏపీలోని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.

ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పలుమార్లు కేసీఆర్ వ్యతిరేకించారు. పలు బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు కేటీఆర్.

ఇక ఆదివారం గోదావరి జిల్లాల్లో పర్యటించిన తోట చంద్రశేఖర్.. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. గత టీడీపీ, ప్రస్తుత అధికార వైసీపీ ఏపీకి చేసిందేమి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా ఒక సీరియస్ ఇష్యూ కింద బీఆర్ఎస్ భావిస్తుందని చెప్పారు.

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ గానీ,  చంద్రబాబు గాని ఏమి చెయ్యలేదన్నారు. మోడీతో స్నేహంగా ఉంటూ కూడా జగన్ ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారని చెప్పారు. ఒక ప్రత్యామ్నాయ పార్టీగా BRS ఏపీలో ఉంటుందన్నారు.  గోదావరి జిల్లాల్లోతో పాటు ఏపీలో BRS  ప్రభావం చూపించబోతుందని జోష్యం చెప్పారు. ఒక్క కాపుల ఓట్లతోనే కాదు.. కులమతాలకతీతంగా బీఆర్ఎస్ ఉండబోతుందని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..