Army: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. ఐఎన్‌ఎస్ వగీర్ సబ్‌మెరైన్ జలప్రవేశం..
భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ముంబైలో ఐఎన్‌ఎస్ వగీర్ సబ్‌మెరైన్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ హాజరయ్యారు.
భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ముంబైలో ఐఎన్‌ఎస్ వగీర్ సబ్‌మెరైన్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ హాజరయ్యారు. తీరప్రాంతాల్లో గస్తీకి, నిఘాకు, ఇంటెలిజెన్స్ సేకరణకు ఈ జలాంతర్గామి ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ ఇది. ‘వగీర్’ అంటే షార్క్‌చేప. నిశ్శబ్దంగా, భయం లేకుండా పనిచేయడం దీని స్పెషాలిటీ. 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత సబ్‌మెరైన్ నుంచి దీనికి ఈ పేరు పెట్టారు. ఈ కొత్త సబ్‌మెరైన్‌ను మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్ నుంచి సాంకేతిక సహకారం తీసుకున్నారు. ఈ సబ్‌మెరైన్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి.
ఐఎన్‌ఎస్ వగీర్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. దీంతో ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం లభిస్తుంది. స్పెషల్ ఆపరేషన్ల కోసం శత్రు స్థావరాల్లోకి మెరైన్ కమాండోలను పంపించే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది. సముద్రం మధ్యలో, తీరాలకు అత్యంత సమీపంలో కూడా ఐఎన్‌ఎస్ వగీర్‌ను మోహరించవచ్చు. దేశీయంగా నిర్మించిన అత్యాధునిక సబ్‌మెరైన్లలో ఇదొకటి. గతంలో భారత్‌లో నిర్మించిన సబ్‌మెరైన్లు అన్నింటిలో వగీర్‌నే అత్యంత వేగంగా నిర్మించారు.
Vagir is a lethal platform with a formidable weapon package. Vagir is the 3rd submarine inducted into Navy in a span of 24 months. It is also a shining testimony to expertise of our shipyards to construct complex & complicated platforms: Admiral R Hari Kumar, Chief of Naval Staff pic.twitter.com/I29AOCv9dO
— ANI (@ANI) January 23, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..