హైస్పీడుతో దూసుకొస్తున్న కారు.. అనుమానం వచ్చి ఆపగా.. పెట్రోల్ ట్యాంక్‌లో..
అసోం పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు జిల్లా శ్రీభూమిలో వాహనాలను సోదా చేస్తున్న సమయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కారు పెట్రోల్ ట్యాంక్‌లో డ్రగ్స్‌ను దాచిపెట్టి పెడ్లర్లు స్మగ్లింగ్ చేస్తుండగా.. పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అసోం పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు జిల్లా శ్రీభూమిలో వాహనాలను సోదా చేస్తున్న సమయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కారు పెట్రోల్ ట్యాంక్‌లో డ్రగ్స్‌ను దాచిపెట్టి పెడ్లర్లు స్మగ్లింగ్ చేస్తుండగా.. పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 650 గ్రాముల హెరాయిన్ , 10 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. థాయ్‌లాండ్ , లావోస్ , కాంబోడియా ట్యాబ్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉందని.. ఈ క్రమంలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు.
రూ. 5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతోపాటు.. నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పువామారా వద్ద మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు..
శ్రీభూమి పోలీసులు పువామారా వద్ద 650 గ్రాముల హెరాయిన్, 5 కోట్ల రూపాయల విలువైన 10,000 యాబా మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా నలుగురు మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎక్స్‌లో ట్విట్ చేశారు.
In a major crackdown, @sribhumipolice seized 650 grams of heroin and 10,000 Yaba tablets worth ₹5 crore at Puwamara, arresting four drug peddlers.@assampolice remains resolute — #AssamAgainstDrugs pic.twitter.com/wPyjQ7Dfkk
— Himanta Biswa Sarma (@himantabiswa) August 27, 2025
అంతకుముందు, కర్బి అంగ్లాంగ్ పోలీసులు సిక్స్ మైల్ వద్ద 10.712 కిలోల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా ఇద్దరు పెడ్లర్లను అరెస్టు చేశారు. అస్సాంలో డ్రగ్స్ ముఠా వెన్నెముకను విచ్ఛిన్నం చేస్తున్నామంటూ సీఎం పేర్కొన్నారు.
ఆగస్టు 26న, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, కాచర్ పోలీసులు లఖిపూర్‌లో రూ. 2.8 కోట్ల విలువైన 416 గ్రాముల హెరాయిన్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డగించి, ఒకరిని అరెస్టు చేశారు.
మాదకద్రవ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నామని.. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




