Kashmir Valley: జమ్ముకశ్మీర్‌‌లో పాక్ ఉగ్రవాదుల లెక్క తేలింది.. ఇక ఏరివేతే మిగిలింది..

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో నక్కిన పాక్ ఉగ్రవాదులకు సంబంధించిన లెక్క తేలింది. ప్రస్తుతం కశ్మీర్ లోయలో 38 మంది పాక్‌ ఉగ్రవాదులు చురుగ్గా ఉంటున్నట్లు ఇంటెలిజన్స్ వర్గాలు నిర్ధారించాయి.

Kashmir Valley: జమ్ముకశ్మీర్‌‌లో పాక్ ఉగ్రవాదుల లెక్క తేలింది.. ఇక ఏరివేతే మిగిలింది..
Kashmir
Follow us

|

Updated on: Nov 12, 2021 | 3:31 PM

జమ్మూకశ్మీర్‌లో నక్కిన పాక్ ఉగ్రవాదులకు సంబంధించిన లెక్క తేలింది. ప్రస్తుతం కశ్మీర్ లోయలో 38 మంది పాక్‌ ఉగ్రవాదులు చురుగ్గా ఉంటున్నట్లు ఇంటెలిజన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఇటీవల కశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడి ఘటనల్లోనూ వీరి ప్రమేయముందని తేల్చారు. ఆ మేరకు పాక్ ఉగ్రవాదుల వివరాలతో కూడిన జాబితాను నిఘా వర్గాలు సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు సమర్పించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు పాక్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు అదనపు భారత భద్రతా బలగాలను హోం శాఖ రంగంలోకి దించింది. నిఘా వర్గాల సమాచారంతో పాక్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత బలగాలు వేట మొదలుపెట్టాయి.

కశ్మీర్‌ లోయలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న 38 మంది పాకిస్థానీ ఉగ్రవాదుల జాబితాను నిఘా వర్గాలు తయారు చేశాయి. ఈ జాబితాలో 27 మంది లష్కరే తోయిబా ,11 మంది జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. వీరు ఉగ్రదాడుల్లో శిక్షణ తీసుకుని భారత్‌కు వచ్చారు. పుల్వామా, బారాముల్లా ప్రాంతాల్లో 10 మంది పాక్ ఉగ్రవాదులు ఉండగా.. శ్రీనగర్‌లో నలుగురు, కుల్గామ్‌లో ముగ్గురు ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. మరో 11 మంది ఇతర ప్రాంతాల్లో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కశ్మీర్‌లోని ఇతర ఉగ్రవాదులకు సహకారం అందించడంతో పాటు భారత భద్రతా దళాలపై వీరు దాడులకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

పాక్ ఉగ్రవాదులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి హైబ్రీడ్‌ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంటున్నారని, వారితో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాల సమాచారంతో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులను అరికట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. కశ్మీర్‌ లోయలో మైనార్టీలు, వలసదారులపై ఉగ్రదాడుల దాడుల తరువాత ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు, వారి అనుచరులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి.

జమ్ముకశ్మీర్‌లోని పాకిస్థాన్ ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత భద్రతాధికారులు హెచ్చరించారు. గత అక్టోబర్ మాసం నుంచి ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 15 మంది పౌరులు మృతి చెందారు.

కశ్మీర్ లోయలో ఇప్పటి వరకు 25 కంపెనీల బీఎస్ఎఫ్, 25 కంపెనీల సీఆర్పీఎఫ్ దళాలు భద్రతా విధుల్లో ఉండేవి. ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఇప్పుడు అదనంగా ఐదు కంపెనీల భద్రతా దళాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్కడకు పంపింది. ఒక్కో కంపెనీలో 100 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. దీంతో కశ్మీర్ లోయలోని విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది సంఖ్య 5500కి చేరింది.

Also Read..

Shiva Raj Kumar: పునీత్ సోదరుడికి అండగా నిలిచిన తారక్.. అన్నా నేనున్నానంటూ…

Telangana News: అది ఇవ్వలేదంటూ మెడికల్ షాపు ఎదుట ఓ యువకుడు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు