Zika virus : చాపకింద నీరులా విస్తరిస్తున్న జికా వైరస్.. కేరళలో పెరుగుతున్న కేసులు.. 

Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. కేరళలో ఈ కేసుల

Zika virus : చాపకింద నీరులా విస్తరిస్తున్న జికా వైరస్.. కేరళలో పెరుగుతున్న కేసులు.. 
Zika Virus
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 13, 2021 | 8:39 PM

Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22కి చేరినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ మీడియాతో పేర్కొన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన 38 ఏళ్ల వైద్యుడికి జికా సోకినట్టు పేర్కొన్నారు. పరీక్షల అనంతరం కోయంబత్తూరు ల్యాబ్‌ నిర్ధారించిందని పేర్కొన్నారు. అలాగే, వైరస్‌ సోకినవారిలో 35 ఏళ్ల వ్యక్తితో పాటు 41 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్లు వీణాజార్జ్ వెల్లడించారు.

ఈ బాధితుల శాంపిల్స్‌ను ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌తో పాటు కోయంబత్తూరుకు చెందిన ఓ ల్యాబ్‌లో పరీక్షించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో జికా వైరస్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని.. అనుమానితులు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

జికా వైరస్‌ ఏడిస్‌ ఈజిప్టి దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. పిల్లలకు సోకితే ఈ వైరస్ వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో పడిన మహిళ.. ప్రాణాలను తెగించి కాపాడిన ఫోటోగ్రాఫర్.. వీడియో

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇళ్ల నిర్మాణం కోసం తక్కువ వడ్డీకే రుణాలు

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!