Viral Video: సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో పడిన మహిళ.. ప్రాణాలను తెగించి కాపాడిన ఫోటోగ్రాఫర్.. వీడియో
Man saves woman from drowning sea : రెప్పపాటులో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పడు ఎలాంటి ఆపద వస్తుందో.. మనం ఊహించడం, అంచనా వేయడం కష్టం. అలాంటి సమయంలో
Man saves woman from drowning sea : రెప్పపాటులో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పడు ఎలాంటి ఆపద వస్తుందో.. మనం ఊహించడం, అంచనా వేయడం కష్టం. అలాంటి సమయంలో ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే వ్యక్తులు ఉండటం.. క్షణాల్లో సాటి వారిని కాపాడటం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఓ మహిళకు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. ఆర్థిక రాజధాని ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో గోడపై కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయింది. ఈ క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడడానికి వచ్చిన 55 ఏళ్ల పల్లవి ముండే.. సముద్రం అంచున ఉన్న గోడ మీద కూర్చొని ఉంది. ఈ తరుణంలో ఆమె సెల్ఫీలు తీసుకుంటుండగా.. ఒక్కసారిగా పల్లవికి మైకం రావడంతో పక్కనే ఉన్న సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న గులాబ్‌చంద్ గోండ్ గమనించి ఆమెను రక్షించేందుకు వెంటనే సముద్రంలోకి దూకాడు.
వైరల్ వీడియో..
#WATCH | Mumbai: A photographer rescued a woman who lost her balance as she was sitting on the safety wall near Gateway of India and fell into the sea yesterday. pic.twitter.com/9Nraxm0gVu
— ANI (@ANI) July 12, 2021
అనంతరం ఆమెను తాడు సహాయంతో ఒడ్డు తీసుకొచ్చాడు. కాగా ఆ మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్‌గా మారింది. చివరకు ఫోటో గ్రాఫర్ ఆపద్భాంధవుడిలా వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమయస్పూర్తితో మహిళను కాపాడిన ఫోటోగ్రాఫర్ గులాబ్ చంద్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.