7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల నిర్మాణం కోసం తక్కువ వడ్డీకే రుణాలు
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తన 52 లక్షల మంది ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను ప్రకటించింది..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తన 52 లక్షల మంది ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇళ్లు నిర్మించడానికి నిధులను సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అతి తక్కువ వడ్డీ ధరలకే ఉద్యోగులకు ఈ పథకం తీసుకొచ్చి సొంతింటి కలను సాకారం చేస్తుంది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం కింద 7.9 శాతం వడ్డీకి రుణాలు అందిస్తుంది. ఇందులో రుణాలు పొందడానికి దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. అయితే ఈ అడ్వాన్స్ పథకం కింద రూ.20 లక్షల వరకు పొందవచ్చు. ఈ ప్రత్యేక పథకం 2020 అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైంది. దీనికి ముందు 2020 సెప్టెంబర్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఇల్లు నిర్మాణం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ అడ్వాన్స్ పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. సొంత భూమిలో ఇల్లు నిర్మించడం, మీరు ఇంటిని మరమ్మతులు చేస్తూ మరింత విస్తరించాలన్న ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. శాశ్వత ఉద్యోగికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఒక తాత్కాలిక ఉద్యోగి ఐదు సంవత్సరాలకుపైగా నిరంతరంగా పని చేసినప్పటికీ అతను గృహ నిర్మాణం కోసం రుణం పొందే వెసులుబాటు ఉంది. ఒక వ్యక్తి గృహ రుణం తీసుకుంటే అతను 20 సంవత్సరాలు పాటు కట్టాల్సి ఉంటుంది. అందులో 15 సంవత్సరాలు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉండగా, 5 సంవత్సరాలు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ లాంటి నిబంధనలు అమలు అవుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్స్‌ను 180 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. గతంలో ఈ గడువు కేవలం రెండు నెలలు మాత్రమే ఉండేది. కోవిడ్19 నిబంధనలు, కరోనా ఆంక్షల నేపథ్యంలో పెన్షనర్ల సమస్యను అర్థం చేసుకుని సులువుగా పెన్షన్ స్లిప్ వారికి అందేలా చర్యలు చేపట్టింది. పింఛన్‌దారులకు మెస్సేజ్, ఈమెయిల్, లేదా వాట్సాప్ సందేశాల రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు పెన్షన్ స్లిప్ అందించడానికి నిర్ణయం తీసుకుంది.
జాతీయ పెన్షన్ విధానంలో మార్పులు..
కాగా, జాతీయ పెన్షన్ విధానం కేంద్ర సర్కార్ మార్పులు చేసింది. దీంతో ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా ప్రయోజనాలు పొందనున్నారు. పాతన పెన్షన్ విధానం ద్వారా పెన్షన్ కార్పస్ అవకాశాన్ని కల్పించింది.