AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC New Rules: యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌నలు

UGC New Rules: ఇక నుంచి పీహెచ్‌డీ ఉంటేనే యూనివర్సిటీల్లో టీచింగ్‌ పోస్టులకు అర్హత ఉంటుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి అని..

UGC New Rules: యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌నలు
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: Jul 13, 2021 | 8:36 PM

Share

UGC New Rules: ఇక నుంచి పీహెచ్‌డీ ఉంటేనే యూనివర్సిటీల్లో టీచింగ్‌ పోస్టులకు అర్హత ఉంటుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి అని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) స్పష్టం చేసింది. ఇప్పటి నుంచి నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అర్హతతో యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరడం కుదరదని స్పష్టం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఈ అర్హ‌తలు ఉన్న‌వారు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి వీలుండేది. ఇందులో నెట్ పాసైన‌వారికి ఐదు నుంచి ప‌ది మార్కులు వెయిటేజ్ ఇస్తుండ‌గా పీహెచ్‌డీ చేసిన‌వారికి 30 మార్కులు వెయిటేజీ ఇచ్చేవారు. 2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించింది. ఇక‌పై వ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కానికి పీహెచ్‌డీ చేసిన‌వారు మాత్ర‌మే అర్హులని, ఈ నిబంధన అమ‌లుకు మూడేళ్ళ స‌మ‌యం ఇస్తున్నామని, 2021 నుంచి ఈ నిబంధ‌న‌ను తప్పకుండా అమ‌లుచేస్తామని అప్ప‌టి కేంద్ర‌మంత్రి జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు.

ఇక కళాశాలల్లో..

ఇక కాలేజీల బోధ‌న సిబ్బంది భ‌ర్తీకి మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు నెట్ లేదా పీహీచ్‌డీ ఉంటే చాలు. అంటే యూనివ‌ర్సిటీల్లో పోస్ట‌ల భ‌ర్తీకి, కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి యూజీసీ వేరువేరు అర్హ‌త‌ల‌ను నిర్దేశించింది. కేవ‌లం పాఠాలు చెప్ప‌డానికే ప‌రిమితం కాకుండా ప‌రిశోధ‌నారంగంలోనూ ఆస‌క్తి చూప‌డానికి వీలుగా కాలేజీ లెక్చ‌రర్ల‌కు ఈ నిబంధ‌న విధించారు. అలాగే గ‌తంలోని అప్రైజల్ విధానం కాలేజీ లెక్చరర్ల ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్స‌హించేదిగా ఉండేది. మారిన నిబంధ‌న‌ల‌తో క‌ళాశాల అధ్యాప‌కులు బోధ‌న‌పై మ‌రింత దృష్టిసారించాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో వ‌ర్సిటీల్లో ప్రొఫెస‌ర్లు అటు టీచింగ్ తోపాటు ఇటు రీసెర్చ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కొత్త ప‌ద్ధ‌తులను యూజీసీ అమ‌ల్లోకి తెస్తోంది. అయితే కాలేజీ అధ్యాప‌కుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించేట‌ప్పుడు బోధ‌నా నైపుణ్యాన్ని ప్ర‌ధానంగా పరిగ‌ణ‌న‌లోకి తీసుకోనున్నారు.

ఇవీ కూడా చదవండి

Ministry of Defence: భారత రక్షణ విభాగంలో ఉద్యోగాలు.. పది నుంచి డిగ్రీ వరకు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలంటే.

GAIL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గెయిల్

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...