చేసేది టీ స్టాల్‌, సమోసా, చిన్న చిన్న వ్యాపారాలు.. ఆస్తులు మాత్రం కోట్లు.. ఐటీ శాఖ దర్యాప్తులో నమ్మలేని నిజాలు

సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారులు లక్షలు, కోట్లు లాభాలు అర్జిస్తూ వెనకేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. కానీ రోడ్ల పక్కన టీ స్టాల్‌, సమోసా అమ్ముకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు.

చేసేది టీ స్టాల్‌, సమోసా, చిన్న చిన్న వ్యాపారాలు.. ఆస్తులు మాత్రం కోట్లు.. ఐటీ శాఖ దర్యాప్తులో నమ్మలేని నిజాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2021 | 11:18 AM

సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారులు లక్షలు, కోట్లు లాభాలు అర్జిస్తూ వెనకేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. కానీ రోడ్ల పక్కన టీ స్టాల్‌, సమోసా అమ్ముకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు అర్జిస్తారంటే పెద్దగా ఎవ్వరు నమ్మరు. చిన్న చిన్న వ్యాపారులు కదా.. వారికి అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. ఇలాంటి నమ్మలేని నిజాలు కాన్పూర్‌లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో వెలుగు చూశాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్‌, క్రిస్పీ-కచోరి, చాయ్‌, సమోసా, పాన్‌ షాపుల వాళ్లలో కొందరు కోట్లాది ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఫుట్‌పాత్‌ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా ఏళ్లుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కొందరు నిరుపేదలుగా కనిపించే ఈ కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు అసలు రంగు బయటపడింది. ఈ విషయాలను చూసి ఐటీ విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ‍ ఆస్తులు భారీగానే కూడబెట్టుకున్నారని పరిశీలనలో బయటపడినప్పుడు ఆశ్యర్యపోయారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని విచారణలో వెల్లడైనట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.

కాగా, హిందూస్థాన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ వ్యాపారులు జిఎస్‌టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదట. కానీ నాలుగు సంవత్సరాలలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని హిందూస్థాన్‌ వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. తవ్వేకొద్ది పెద్ద పెద్ద ఆస్తులున్నవారు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

Home Loan EMI: మీరు గృహ రుణం తీసుకుంటున్నారా..? అయితే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం ఎలా..?