Home Loan EMI: మీరు గృహ రుణం తీసుకుంటున్నారా..? అయితే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం ఎలా..?

Home Loan EMI: ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా గృహ రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు వినియోగదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా తక్కువ..

Home Loan EMI: మీరు గృహ రుణం తీసుకుంటున్నారా..? అయితే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం ఎలా..?
Home Loan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 20, 2021 | 11:25 AM

Home Loan EMI: ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా గృహ రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు వినియోగదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. అయితే గృహ రుణం ఈఎంఐ నిర్ణయించేవి ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి వడ్డీ రేటు, రెండోది చెల్లింపులను ఎంచుకునే కాలపరిమితి. కొత్తగా గృహ రుణం తీసుకున్నవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే ఈఎంఐను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

త‌క్కువ లోన్ టు వాల్యూ (ఎల్‌టీవీ)

ఆస్తి విలువలో బ్యాంకులు లేదా ఇతర రుణ సంస్థల నుంచి పొందే రుణ శాతమే ఎల్‌టీవీ రేషియో. మిగిలిన మొత్తాన్ని రుణ గ్రహిత సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సాధార‌ణంగా గృహ మొత్తం విలువ‌లో 80 నుంచి 85 శాతం వ‌ర‌కు రుణం ఇస్తుంటాయి. మ‌రికొన్ని సంస్థలు 90 శాతం వరకు కూడా ఆఫ‌ర్ చేస్తాయి. అయితే ఇంటి మొత్తం విలువ‌లో ఎల్‌టీవీ రేషియోని త‌గ్గించుకుంటే .. త‌క్కువ వ‌డ్డీకే రుణం ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. దీని ద్వారా ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే కనీస డౌన్‌పేమెంట్‌ చెల్లించి మిగిలిన మొత్తం రుణం తీసుకోకుండా.. డౌన్‌పేమెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎల్‌టీవీ రేషియో త‌గ్గితే, రుణ దాత‌ల‌కు క్రెడిట్ రిస్కు త‌గ్గుతుంది. అందుకే త‌క్కువ వ‌డ్డీ రేటుకే గృహ రుణాల‌ను ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఇది వ‌డ్డీతో పాటు, అప్పు తీసుకునే వారి ఈఎంఐ భారాన్ని త‌గ్గిస్తుంది పైసాబజార్.కామ్ గృహ రుణాల అధిపతి రతన్ చౌదరి చెబుతున్నారు.

ఎక్కువ కాల‌ప‌రిమితి..

కొత్తగా హోమ్‌ లోన్‌ తీసుకునేవారు ఎక్కువ కాలపరిమితి ఎంచుకోవడం ద్వారా ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎక్కువ కాల‌ప‌రిమితితో ఈఎంఐ త‌గ్గుతుంది కానీ వ‌డ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వ‌స్తుంది. త‌క్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకుంటే ఈఎంఐ అధికమైనా వ‌డ్డీ మొత్తం త‌గ్గుతుంది. ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకునే వారి గృహ రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కారణం ఏంటంటే.. కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా ఉంటే ఈఎంఐ త‌క్కువ ఉంటుంది. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తులు సులభంగా ఈఎంఐలు చెల్లించగలుగుతారు.

ఆన్‌లైన్‌లో రేట్లను పోల్చండి

గృహరుణం కోసం ఏదైనా బ్యాంకును, రుణ సంస్థలను ఎంచుకునే ముందు ఆన్‌లైన్‌లో వివిధ సంస్థలు ఆఫర్‌ చేస్తున్న గృహ రుణాల వడ్డీ రేట్లను పరిశీలించండి. స‌రైన రుణం పొందేందుకు ప్రస్తుతం అనేక వెబ్‌సైట్‌లు స‌హాయ‌ప‌డుతున్నాయి. ఆన్‌లైన్ పోర్టల్స్‌, వివిధ సంస్థలు అందించే రుణాలు, వాటి వడ్డీ రేట్లు, ఫీజులు అలాగే ఇతర ఛార్జీల గురించి స‌వివ‌రంగా తెలియ‌జేస్తున్నాయి. మెరుగైన‌ గృహ రుణం పొందేందుకు స‌రైన రీతిలో అన్నింటిని ప‌రిశీలించి స‌రైన గృహ‌ రుణం ఎంచుకోవ‌డం ఉత్తమం.

ఇవీ కూడా చదవండి:

SBI Special FD Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు పెంపు.. వడ్డీ రేటు 6.2 శాతం

Tata Motors: రోజూ రూ.120 పొదుపు చేస్తే కారు సొంతం చేసుకోవచ్చు.. టాటా మోటార్స్‌ అదిరిపోయే ఆఫర్‌

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు