Dowry Harassment: పెళ్ళైన ఐదు నెలలకే దారుణం.. కారు కొనేందుకు వరకట్నం తీసుకు రాలేదని.. భార్యతో యాసిడ్ తాగించిన భర్త..!

: ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అబలలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వరకట్న దాహానికి ఎందరో యువతులు బలవుతూనే ఉన్నారు.

Dowry Harassment: పెళ్ళైన ఐదు నెలలకే దారుణం.. కారు కొనేందుకు వరకట్నం తీసుకు రాలేదని.. భార్యతో యాసిడ్ తాగించిన భర్త..!
Gwalior Dowry Harassment

Gwalior Woman forced to drink Acid: ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అబలలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వరకట్న దాహానికి ఎందరో యువతులు బలవుతూనే ఉన్నారు. దుర్మార్గాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. సమాజంలో మార్పు రావడం లేదు. వరకట్నం కోసం మహిళను వేధిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ కట్నం దాహానికి కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

పెళ్లైన ఐదు నెలలకే వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న భర్త.. ఆమెను చింత్రహింసలకు గురి చేయడమే కాకుండా.. బలవంతంగా యాసిడ్ తాగించాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేకుంటే చంపేస్తానని నరకం చూపించాడు. భర్త రూపంలో ఉన్న కసాయి ఆగడాలు తాళలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. పోలీసులు చెప్పిన వివరల ప్రకారం.. గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు 5 నెలల క్రితం శశి అనే యువతితో వివాహమైంది. వధువు తల్లిదండ్రులు వివాహం సమయంలో రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు. అయితే, ఆ సొమ్ము అతనికి సరిపోలేదు. మరింత అదనంగా కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు వీరేంద్ర.

కారు కొనేందుకు రూ.3 లక్షలు కావాలని.. పుట్టింటికి డబ్బులు తేవాలని భార్యను నిత్యం చిత్రహింసలకు గురిచేశాడు. పెళ్లికే ఎన్నో అప్పులు చేశారని..ఇప్పుడు మళ్లీ అంతా డబ్బు కావాలంలే ఎక్కడి నుంచి తెస్తారని ఆమె ప్రశ్నించింది. ఈ విషయంలో ఇరువురి మధ్య మాట మాటా పెరిగి గొడవ పెద్దదయింది. దీంతో ఆమెపై భార్యను విపరీతంగా కొట్టి.. ఆపై ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించాడు. దీంతో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ శరీరం లోపలి భాగాలకు వెళ్లడంతో పలు అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఢిల్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు వీరేంద్రను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే, ఈ కేసు దర్యాప్తులో మధ్యప్రదేశ్ పోలీసు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జులై 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ బలహీనమైన కేసులు మాత్రమే రాశారని బాధితురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహిత పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, జులై 18న ఆమెను చికిత్స కోసం ఢిల్లీకి తరలించిన తర్వాత..ఆమె సోదరుడు ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు DCW టీమ్ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించింది. ఆమె స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. దాని గురించి ప్రశ్నించినందుకు అదనపు కట్నం పేరుతో వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై DCW చీఫ్ స్వాతిమాలివాల్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖరాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదును తేలిగ్గా తీసుకున్న పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. శరీరం లోపలి భాగాలు దెబ్బతిన్నాయి. తరచూ రక్తపు వాంతులు అవుతున్నాయని కుటుంబసభ్యులు తెలపారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

Read Also…. Viral video: షాకింగ్.. చూస్తుండగానే ఎత్తుకు పెరుగుతున్న భూమి.. వీడియో వైరల్..

Click on your DTH Provider to Add TV9 Telugu