Jharkhand: ఎంత కఠినాత్ములో.. చదువులేని అబ్బాయితో చనువుగా ఉందని కన్న కూతుర్నే చంపేశారు..

ఇంటర్మీడియట్ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థిని ఓ అబ్బాయిని ప్రేమించింది.. ఆ అబ్బాయి చదువుకోలేదు. అలాంటి అబ్బాయిని ప్రేమించడంపై కోపంతో బంధువులు బాలికను హత్య చేశారు. ఎంతటి దారుణం..

Jharkhand: ఎంత కఠినాత్ములో.. చదువులేని అబ్బాయితో చనువుగా ఉందని కన్న కూతుర్నే చంపేశారు..
Lovers
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 11, 2022 | 8:22 PM

Jharkhand: ఇంటర్మీడియట్ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థిని ఓ అబ్బాయిని ప్రేమించింది.. ఆ అబ్బాయి చదువుకోలేదు. అలాంటి అబ్బాయిని ప్రేమించడంపై కోపంతో బంధువులు బాలికను హత్య చేశారు. నోటిలో గుడ్డలు కుక్కి..గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి స్కూటర్‌పై తీసుకెళ్లారు. మృతదేహాన్ని కొండ సమీపంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా సిసాయి పోలీస్ స్టేషన్ పరిధి ఆర్కో గ్రామంలో ఈ పరువు హత్య సంచలనం సృష్టించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని గుంతలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలిక తండ్రిని అరెస్టు చేయగా, తల్లి, సోదరుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి మంగ్రా ఓరాన్ నేరం అంగీకరించాడు. తన కుమార్తె సరిత లోహర్‌దగాలోని భాంద్రాకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. సరిత భండారాలోని ప్లస్ టూ స్కూల్‌లో ఇంటర్ సైన్స్ విద్యార్థిని. ఆమె ప్రేమించిన యువకుడు చదువుకోకపోవడంతో సరిత ఇంటి వారందరూ వ్యతిరేకించారు. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె చాలాసార్లు ఆ యువకుడి వద్దకు వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి, సోదరులు గత గురువారం రాత్రి ఆమె నోటిలో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి పక్కనే ఉన్న కొండ కింద నది ఒడ్డున గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు.

వారం రోజుల తర్వాత నదికి సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న వ్యక్తులు దుర్వాసన రావడంతో తొలుత గ్రామస్తులకు, ఆపై పోలీసులకు సమాచారం అందించారు. కస్టడీలో ఉన్న బాలిక తండ్రిని పోలీసులు విచారించగా, అతడు మొదట తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ, తరువాత అతను నేరం అంగీకరించాడు.. అతని సూచన మేరకు పోలీసులు గొయ్యి తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలిక తల్లి, సోదరుల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి