AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బస్టాండ్‌లో చాలా సేపుగా తారసలాడుతున్న మహిళ.. ఆమె బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు షాక్

గుట్టుగా వ్యాపారం సాగుతూనే ఉంది. కేసులు పెట్టి జైళ్లో పెడుతున్నా కేటుగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నారు.

Viral: బస్టాండ్‌లో చాలా సేపుగా తారసలాడుతున్న మహిళ.. ఆమె బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు షాక్
Representative image
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2022 | 9:32 PM

Share

Crime news: మత్తు రవాణాకు బ్రేక్ పడటం లేదు. స్మగ్లర్స్ తగ్గేదే లే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. నెక్ట్స్ లెవల్‌లో ప్లాన్స్ వేస్తూ గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా హద్దులు దాటించేస్తున్నారు. ఇక గంజాయి అమ్మేవారు సైతం పెద్ద భయపడకుండా పబ్లిక్ ఎక్కువగా ఉండే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్ వద్ద మాటు వేసి గలీజ్ దందా షురూ చేస్తున్నారు. మహిళల అయితే పోలీసులు పెద్దగా తనిఖీలు చేయరని.. వారిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి లాగుతున్నారు. తాజాగా చెన్నై(Chennai) ఒరగడమ్‌(oragadam)లో ఓ 31 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేసి 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వండలూరు-వాలాజాబాద్ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఒరగడాం పోలీసులు పనపాక్కం బస్టాప్ వద్ద చాలా సేపు నిలబడి ఉన్న మహిళను గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆమె తత్తరపాటుకు గురైంది. పొంతనలేని ఆన్సర్స్ చెప్పింది. దీంతో  ఆమె వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో గంజాయి కనిపించింది. వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆమెను వల్లం గ్రామానికి చెందిన అమ్ముగా గుర్తించారు. అమ్ము ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. దాన్ని ఒరగడమ్‌ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు విక్రయిస్తుందని పోలీసులు గుర్తించారు. అమ్మును జ్యుడీషియల్ కస్టడీకి తరలించి జైలుకు తరలించారు. ఆమె గంజాయి సప్లై చేసే వ్యక్తిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి