AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bull attacked: వీధుల్లో విచ్చలవిడిగా పశువుల సంచారం.. మహిళను ఎత్తిపడేసిన ఎద్దు.. నగరపాలక వ్యవస్థపై నెటిజన్ల ఫైర్‌

ఈ ఘటన తన ప్రాంతంలోనే కాదని, నగరం మొత్తంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని అతడు వాపోయాడు. నగరపాలక వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు..

Bull attacked: వీధుల్లో విచ్చలవిడిగా పశువుల సంచారం.. మహిళను ఎత్తిపడేసిన ఎద్దు.. నగరపాలక వ్యవస్థపై నెటిజన్ల ఫైర్‌
Bull
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2022 | 7:36 PM

Share

Bull attacked: ఎద్దు భీభత్సానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోడ్డుపై నడుస్తున్న మహిళను వెనుక నుండి అకస్మాత్తుగా ఎద్దు దాడి చేసింది. ఎద్దు దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పరిపాలనా నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్థానిక పాలకవర్గం నిర్లక్ష్యం వల్లే విచ్చలవిడిగా జంతువులు రోడ్లపై సంచరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువై పోతున్నాయంటూ నెటిజన్లు వాపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై అకస్మాత్తుగా ఎద్దు దాడి చేసింది. ఎద్దు ఆమెను కొమ్ములతో పైకి లేపి నేలకేసి కొట్టింది..అంతటితో ఆగలేదు..ఆమెను తొక్కి చంపటానికి ప్రయత్నించింది. కానీ, అంతలోనే చుట్టుపక్కల జనాలు అరుస్తూ..పరిగెత్తుకుంటూ వచ్చి ఎద్దును తరిమికొట్టారు. ఈ షాకింగ్‌ వీడియో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు చెందినదిగా తెలిసింది. ఖాండ్వాకు చెందిన సోషల్ మీడియా వినియోగదారు తరుణ్ వర్మ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇది తన ఇంటి సమీపంలో జరిగిన సంఘటనగా ఆయన వివరించారు. బుధవారం సాయంత్రమే ఈ ఘటన జరిగినట్టుగా వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్ తరుణ్ వర్మ ఈ పోస్ట్‌లో ఖాండ్వాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా ట్యాగ్ చేశారు. అందులో ఒకరు స్థానిక ఎమ్మెల్యే దేవేంద్ర వర్మ కాగా, మరొకరు కొత్త మేయర్ అమృతా అమర్ యాదవ్ భర్త, కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు అమర్ యాదవ్.

తరుణ్ వర్మతో మాట్లాడినప్పుడు బుధవారం రాత్రి 7:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.ఖాండ్వాలోని దూబే కాలనీలోని ఓం చౌక్‌లో తరుణ్ నివసిస్తున్నాడు.ఈ ఘటన అతని ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. మహిళ తన ఇంటికి తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఎద్దు వచ్చి ఆమెపై దాడి చేసిందని తరుణ్ చెప్పాడు. ఎద్దు మహిళను తన కొమ్ములతో లేపి గాలిలోకి విసిరింది. ఎద్దు ఇక్కడితో ఆగలేదు, మహిళపై దాడి చేస్తూనే ఉంది. అయితే చుట్టుపక్కల వారు పరుగులు తీసి మహిళ ప్రాణాలను కాపాడారు. ఘటన తర్వాత మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని తరుణ్ తెలిపాడు. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన తన ప్రాంతంలోనే కాదని, నగరం మొత్తంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని అతడు వాపోయాడు. ఒక్క దూబే కాలనీలోనే 5 నుంచి 6 ఎద్దులు తిరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతమంతా విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని చెప్పారు. కానీ, నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మునిసిపల్ కార్పొరేషన్ దీనిపై దృష్టి పెట్టకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు బలికావాల్సి వస్తోందనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే, ఎద్దు దాడిలో గాయపడిన మహిళ దూబే కాలనీకి చెందిన 85 ఏళ్ల సుగ్రా బి.సుగ్రా బిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ శరీరం సగం పని చేయడం లేదు.నిరుపేద కుటుంబానికి చెందిన ఈ మహిళకు వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేదని తాను, తన సోదరుడు కూలి చేసుకుంటూ జీవిస్తున్నామని బాధితురాలి కుమారుడు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో తన తల్లికి సరైన వైద్యం చేయించలేక పోతున్నానని వాపోయాడు. దాతల సాయం కోసం వేడుకుంటున్నాడు. విచ్చలవిడిగా సంచరిస్తున్న జంతువులపై చర్యలు తీసుకోవాలని, తన తల్లికి మెరుగైన వైద్యం చేయించాలని బాధితురాలి కుమారులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి