AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: గతంలో కరోనా బారిన పడిన పిల్లలకు మళ్లీ కోవిడ్‌ పాజిటివ్‌.. ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?

Covid-19: దేశంలో కొత్త కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి . ఇంతలో పిల్లలలో కరోనా రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. జనవరి లేదా ఏప్రిల్‌లో కోవిడ్ సోకిన పిల్లలు మళ్లీ..

Covid-19: గతంలో కరోనా బారిన పడిన పిల్లలకు మళ్లీ కోవిడ్‌ పాజిటివ్‌.. ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?
Covid 19
Subhash Goud
|

Updated on: Aug 11, 2022 | 8:20 PM

Share

Covid-19: దేశంలో కొత్త కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి . ఇంతలో పిల్లలలో కరోనా రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. జనవరి లేదా ఏప్రిల్‌లో కోవిడ్ సోకిన పిల్లలు మళ్లీ పాజిటివ్ అవుతున్నారు. అయితే శుభవార్త ఏమిటంటే పిల్లలు తేలికపాటి లక్షణాలను మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. వారంతా ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. అదే సమయంలో పిల్లలు కూడా వైరల్, ఫ్లూ సమస్యను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ నుండి పిల్లలను రక్షించడానికి అవసరమైన అన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఢిల్లీలోని మధుకర్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ నితిన్ వర్మ మాట్లాడుతూ.. కోవిడ్-19 రీఇన్‌ఫెక్షన్ కేసులు ఆసుపత్రికి వస్తున్నాయని చెప్పారు. అలాంటి పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, ఒకసారి కరోనా సోకిన వారు మళ్లీ రెండవసారి కరోనా బారిన పడుతున్నారన్నారు. అలాగే పిల్లలకు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయన్నారు. ముఖ్యంగా బడికి వెళ్లే చిన్న పిల్లల్లో చేతి, కాళ్లు, నోటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ కేసులు కూడా చాలా ఉన్నాయి. అలాగే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ కేసులు కూడా వస్తున్నాయన్నారు.

చాలా మంది పిల్లలలో లక్షణాలు తేలికపాటివే..

కోవిడ్‌కు సంబంధించిన కేసుల్లో చాలా వరకు తేలికపాటి లక్షణాలే ఉన్నాయని, వీటిని ఇంట్లోనే నయం చేయవచ్చని డాక్టర్ వర్మ చెప్పారు. ప్రస్తుతం చిన్నారులకు జ్వరం ఉందని, కొందరికి గొంతునొప్పి ఉందని, మరి కొంతమంది పిల్లలకు దద్దుర్లు, వాంతులు, వీరేచనాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాఠశాలల్లో పిల్లలందరూ మాస్క్‌లు ధరించేలా చూడాలి. చేతుల పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. తినడానికి ముందు మీ చేతులను కడిగేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేసులు చాలా ఎక్కువగా ఉంటే తప్ప పిల్లల పాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. అందువల్ల కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా లేదా తీవ్రమైన అనారోగ్యంతో కేసులు వస్తున్నప్పుడు పాఠశాలలను మూసివేయవలసి ఉంటుందని, శానిటేషన్‌, సామాజిక దూరాన్ని పాటించడం కూడా చాలా ముఖ్యన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి