Terrorist Killed: 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం.. 30 కిలోల ఐఈడీ స్వాధీనం
Terrorist Killed: దేశంలో ఉగ్రవాదుల కదలికలు పెరుగుతుండటంతో భారత భద్రతా బలగాలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారిని అంతమొందించేందుకు ప్రతి రోజు గాలింపు..
Terrorist Killed: దేశంలో ఉగ్రవాదుల కదలికలు పెరుగుతుండటంతో భారత భద్రతా బలగాలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారిని అంతమొందించేందుకు ప్రతి రోజు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. దేశంలో జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రకదలికలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ ఉగ్రవాదులు హతమయ్యారు. గత 24 గంటల్లో, బుద్గామ్, రాజౌరిలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భద్రతా బలగాలు. అలాగే 30 కిలోల IED స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 36 మంది విదేశీ ఉగ్రవాదులు సహా 136 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని ఆర్మీ క్యాంపులోకి గురువారం ఉదయం ఆత్మాహుతిదాడుల కారణంగా ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడిలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు పర్గల్‌లోని ఆర్మీ క్యాంపు కంచె దాటేందుకు ప్రయత్నించారని, సైనికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. తర్వాత కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు.
బుద్గామ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
బుధవారం తెల్లవారుజామున బుద్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని వాటర్‌హోల్‌లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా దళాలు .. అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని తెలిపారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. వాంటెడ్ టెర్రరిస్ట్ లతీఫ్ రాథర్‌తో సహా ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లతీఫ్, రాహుల్ భట్, అమ్రిన్ భట్ సహా అనేక మంది పౌరులను హతమార్చడంలో ప్రమేయం ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి