75 Years of Independence: దేశంలో పోస్టల్ పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు..? 6 అంకెల కోడ్ అర్థం ఏంటో తెలుసా..?
75 Years of Independence: భారతదేశంలో 1970లకు ముందు ఉత్తరాలు ప్రధాన సమాచార సాధనాలు. గత కొన్ని సంవత్సరాల కిందట ఉత్తరాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. టెక్నాలజీ పెరుగుతున్న..
75 Years of Independence: భారతదేశంలో 1970లకు ముందు ఉత్తరాలు ప్రధాన సమాచార సాధనాలు. గత కొన్ని సంవత్సరాల కిందట ఉత్తరాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఉత్తరాలు కనుమరుగయ్యాయి. 1970కి ముందు తపాలా శాఖ వివిధ భాషలు, ఒకే పేరుతో ఉన్న అనేక ప్రదేశాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి తపాలా శాఖ పిన్ కోడ్‌కు ఏర్పాటు చేసింది. తద్వారా వ్యక్తి గుర్తింపు అతని ఆధార్ నంబర్ వలె ప్రతి ప్రాంతానికి దాని స్వంత గుర్తింపు ఉంటుంది. ఈ వ్యవస్థను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మాజీ అదనపు కార్యదర్శి శ్రీ రామ్ భికాజీ వేలంకర్ ప్రారంభించారు. ఈయనను భారతదేశంలో పిన్‌కోడ్ పితామహుడు అని పిలుస్తారు. అతని కృషి కారణంగా పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో 15 ఆగస్టు 1972న ప్రారంభించబడింది. ఆ సమయంలో దేశం మొత్తం 9 జోన్‌లుగా విభజించబడింది. అందులో 8 జోన్‌లు దేశానికి ఇవ్వగా, 9వ ఆర్మీ పోస్టల్ జోన్‌ను ప్రత్యేకంగా ఉంచారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పిన్‌కోడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కమ్యూనికేషన్ చాలా సులభతరంగా మారింది.
పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. అప్పట్లో దేశాన్ని 9 జోన్‌లుగా విభజించి ఒక్కో జోన్‌కు ఒక్కో నంబర్ ఇచ్చారు. పిన్ కోడ్ 6 సంఖ్యలతో రూపొందించి ఉంటుంది. ఈ కోడ్‌లోని ప్రతి అంకె ప్రత్యేకమైనది. ఇది మీ ప్రాంతం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దానిలోని ప్రతి సంఖ్య ఒక నిర్దిష్ట ప్రాంతం కోసం మాత్రమే రూపొందించారు. ఈ సమాచారం సహాయంతో వస్తువుల పంపిణీ సులభతరం చేయవచ్చని, సరైన చిరునామాకు పంపించవచ్చని ఈ పిన్‌కోడ్‌ను రూపొందించారు.
6 అంకెల పిన్ అంటే ఏమిటి..?
పిన్ కోడ్‌లో మొత్తం ఆరు నంబర్లను కలిగి ఉంటుంది. ఈ ఆరు అంకెల పిన్‌కోడ్‌కు అర్థం ఉంది. మొదటి సంఖ్య రాష్ట్రాన్ని సూచిస్తుంది. రెండవ సంఖ్య ఉప-ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఇక మూడవ సంఖ్య రాష్ట్రంలోని జిల్లాను గుర్తిస్తుంది. పిన్ కోడ్‌లోని చివరి 3 అంకెలు పోస్టాఫీసును గుర్తిస్తాయి.
1972 ఆగస్టు 15న పిన్‌కోడ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పుడు ఆ సమయంలో భారతదేశం 8 భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడింది. తొమ్మిదవ జోన్‌ను ఆర్మీ పోస్టల్ సర్వీస్‌కు రిజర్వ్‌గా ఉంచారు. నేడు దేశంలో మొత్తం 19101 పిన్‌లు ఉన్నాయి. ఇందులో ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఉండదు.
దేశంలోని 8 పోస్టల్ జోన్లు:
1 ఉత్తర ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్
2. ఉత్తర ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్
3. పశ్చిమ రాజస్థాన్, గుజరాత్
4. పశ్చిమ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
5. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
6. కేరళ, తమిళనాడు
7. తూర్పు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఈశాన్య
8. తూర్పు బీహార్, జార్ఖండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి