ED Summons: పశ్చిమ బెంగాల్‌లో దూకుడు పెంచిన ఈడీ.. ఎనిమిది మంది ఐపీఎస్‌లకు సమన్లు..

పశ్చిమ బెంగాల్‌లో ఈడీ దూకుడుగా ఉంది. కోల్‌ స్కాంలో 8 మంది IPSలకు సమన్లు జారీ చేసింది.

ED Summons: పశ్చిమ బెంగాల్‌లో దూకుడు పెంచిన ఈడీ.. ఎనిమిది మంది ఐపీఎస్‌లకు సమన్లు..
Ed Summons
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 11, 2022 | 7:58 PM

మరోసారి దూకుడు పెంచింది. బెంగాల్‌లోని ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. బొగ్గు కుంభకోణం కేసులో జ్ఞానవంత్ సింగ్, కోటేశ్వరరావు, సెల్వమురుగన్, శ్యామ్ సింగ్, రాజీవ్ మిశ్రా, సుకేష్ కుమార్ జైన్, తథాగత బసు సహా ఎనిమిది మంది ఐపీఎస్ అధికారు ఇందులో ఉన్నారు. ఈ నెల 21 నుంచి 31 మధ్య న్యూఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. బొగ్గు స్కామ్‌లో ఈ ఐపీఎస్‌లు కీలక పాత్ర పోషించారని ఈడీ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వారు బొగ్గు స్మగ్లింగ్ జరిగిన ప్రాంతాల్లోనే వీరు పని చేశారు. స్కాంలో వీరు కూడా లబ్ధి పొందివుండవచ్చని ఆధారాలు ఉన్నాయని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మందిలో ఏడుగురిని 2021లో కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

బొగ్గు స్కాం కేసు బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్తే.. తృణమూల్ కాంగ్రెస్ యువనేత వినయ్ మిశ్రా, స్థానిక కోల్‌ ఆపరేటర్ అనుప్ మాఝీ ప్రధాన నిందితులు. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మాఝీ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. మార్చిలో ఈడీ అభిషేక్ బెనర్జీని కూడా ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐతో పాటు ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు నిర్వహిస్తోంది.

నవంబర్ 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ పశ్చిమ బెంగాల్‌లో అనేక గనులు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో ఓ ముఠా వేల కోట్ల రూపాయల బొగ్గును అక్రమంగా తవ్వి అనేక సంవత్సరాలుగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తోందని సీబీఐ అభియోగం.

మరిన్ని జాతీయ వార్తల కోసం