Viral : ఇదేక్కడి విడ్డూరం..! ఒక్కసారి కూడా గర్భం దాల్చని ఆవుదూడ, రెండు పూటలు, 11నెలలుగా లీటర్ల కొద్ది పాలిస్తుంది..

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఎక్కడా ఏం జరిగినా అది క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఎక్కడా ఓ విచిత్రం జరిగినా మనిషి అరచేతిలో వాలిపోతుంది. ప్రపంచ వింతలు, విశేషాలు ఎప్పటికప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Viral : ఇదేక్కడి విడ్డూరం..! ఒక్కసారి కూడా గర్భం దాల్చని ఆవుదూడ, రెండు పూటలు, 11నెలలుగా లీటర్ల కొద్ది పాలిస్తుంది..
Calf Gives Milk
Follow us

|

Updated on: May 16, 2022 | 5:53 PM

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఎక్కడా ఏం జరిగినా అది క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఎక్కడా ఓ విచిత్రం జరిగినా మనిషి అరచేతిలో వాలిపోతుంది. ప్రపంచ వింతలు, విశేషాలు ఎప్పటికప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో అనేక వార్తలు, వీడియోలు,ఫోటోలు నెటిజన్లకు అవాక్కయ్యేలా చేస్తుంటాయి. మరికొన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. తాజాగా కేరళలో జరిగిన ఓ విచిత్ర సంఘటన సోషల్‌ మీడియాలో చేరింది. ఇంటర్‌నెట్‌ వేదికగా నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. అది తెలిస్తే.. ఇది నిజమా..? ఫేమస్‌ అయ్యేందుకు లేక ఫేక్‌ న్యూస్‌ ఏమైనా వైరల్‌గా మార్చేశారా..? అనే సందేహం కలుగుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే..

కేరళలోని కన్నూరు జిల్లాలో ఓ దూడ లీటర్ల కొద్ది పాలిస్తోంది. ఇదేంటీ ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..? ఇదే వింత ఎందుకంటే..ఆ ఆవుదూడ వయసు 11 నెలలు మాత్రమేనట..పైగా అది ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. అయినా రోజుకు మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. కన్నూర్‌ జిల్లా కంగోల్‌కు చెందిన సజేశ్‌ అనే రైతు ఆవులు, గొర్రెలు, కోళ్ల పౌల్ట్రీని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2021 జులైలో ఓ జెర్సీ ఆవు, దూడను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆవుకి ఏదో ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దాంతో ఆవును అమ్మేశాడు. దూడ మాత్రం తనే పెంచుతున్నాడు. ఇదిలా ఉండగానే, ఓ రోజు ఉన్నట్టుండి ఆవుదూడ పొదుగు పొదుగు ఉబ్బి ఉండడాన్ని గమనించింది సజేశ్‌ భార్య. వెంటనే విషయం భర్తకు చెప్పింది. అదేంటని పరిశీలించి చూడగా.. పల్చటి పాలు వచ్చాయి. దూడకు రాగి, వేరుశెనగలు కలిపిన మంచి మేత వేస్తూ.. కొన్నిరోజుల తర్వాత మరోసారి పాలు పితికి చూశాడు రైతు సజేశ్‌. ఈ సారి చిక్కటి పాలు ఇచ్చింది. గత 15 రోజులుగా.. నిత్యం రెండు పూటల ఆ దూడ మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. దూడ ఇస్తున్న పాలలో 8.8 శాతం వరకు కొవ్వు ఉంటున్నట్లు తెలిసింది.ఒక్కసారి కూడా గర్భం దాల్చని దూడ పాలివ్వడం పెద్ద వింతగా మారింది. తల్లి కాకుండానే లీటర్ల కొద్ది పాలిస్తున్న దూడను విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. చుట్టుపక్కల జనాలు సైతం దూడను చూసేందుకు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి