AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : భారత్‌కు రోబోల అవసరమే లేదు..! దేశంలో ఇలాంటి వ్యక్తులుండగా,..ఇతడు మనిషా..? లేక యంత్రమా.?

ప్రస్తుతమంతా స్మార్ట్‌ వర్క్‌ యుగం..ప్రతిపనిలోనూ మనిషి తక్కువ కష్టపడుతూ ఎక్కువ ఫలితం సాధించేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతిరోజూ చేసే ఇంటి పనుల నుంచి సాగుబడి వరకు అంతటా యంత్రాలు ఆక్రమించేశాయి.

Viral video : భారత్‌కు రోబోల అవసరమే లేదు..! దేశంలో ఇలాంటి వ్యక్తులుండగా,..ఇతడు మనిషా..? లేక యంత్రమా.?
Robotic Automation
Jyothi Gadda
|

Updated on: May 16, 2022 | 3:26 PM

Share

ప్రస్తుతమంతా స్మార్ట్‌ వర్క్‌ యుగం..ప్రతిపనిలోనూ మనిషి తక్కువ కష్టపడుతూ ఎక్కువ ఫలితం సాధించేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతిరోజూ చేసే ఇంటి పనుల నుంచి సాగుబడి వరకు అంతటా యంత్రాలు ఆక్రమించేశాయి. కూరలు తరగాలంటే ఓ యంత్రం, ఇల్లు ఊడవాలంటే ఓ యంత్రం, చివరకు వరి నాట్లు, కోతలు, ధాన్యం సేకరణ కూడా యంత్రాలే చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఓ మనిషి తను చేస్తున్న పనిలో అద్భుతం చేశాడు. అతని చేతుల్లోనే కనిపించని యంత్రాలు దాగివున్నాయా అనేంతలా మాయచేస్తున్నాడు. అతడు చేస్తున్న పని చూస్తే..అతడు మనిషా..? లేక రోబోనా..? అనే సందేహం కలుగమానదు..ఇంతకీ అతడు చేస్తున్నాడు అన్నది పరిశీలించినట్టయితే…

ఓ గోడాన్‌లో కిలోల కొద్దీ క్యాబేజీలు కుప్పలుగా పోశారు. బహుశా అవన్నీ వారి వ్యవసాయ క్షేత్రంలో పండించినవి అనుకుంటా..పంట తీసిన రైతులు క్యాబేజీలన్నీ ఓ చోట కుప్పపోశారు. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే, చెట్టు నుంచి వేరు చేసిన క్యాబేజీకి కాండం, ఆకులు పెద్దపెద్దగా ఉండటంతో బస్తాలలో నింపేందుకు కాస్త స్పేస్‌ ఎక్కువగా అవసరం కావొచ్చింది. దాంతో వాటికున్న ఆకులు, కాండం తొలగిస్తున్నారు. కింద కూర్చుని ఉన్న ఓ వ్యక్తి నిలబడి ఉన్న వ్యక్తికి ఒక్కో క్యాబేజీని విసురుతున్నాడు. ఇక్కడ వారి పనితనం ఎలా ఉందంటే..రోబోలు కూడా ఇంత స్పీడ్‌గా చేయలేవనుకుంటా..! అనే సందేహం కలుగక మానదు. కూర్చుని ఉన్న వ్యక్తి ఒక్కో క్యాబేజీని విసురుతుంటే..చాకచక్యంగా పట్టుకుంటున్నాడు నిలబడి ఉన్న వ్యక్తి..వాటికి ఉన్న కాండాన్ని అంతే స్పీడ్‌గా కట్‌ చేస్తున్నాడు. అదే స్పీడ్‌తో పక్కకు విసురుతున్నాడు. అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు ఖాళీ బస్తాను పట్టుకు నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌ ఖాతాదారు ఒకరు వీడియోను షేర్‌ చేస్తూ ఓ ఆసక్తికర ట్యాగ్‌ను జోడించారు. ఇలాంటి వ్యక్తులు ఉండగా, భారత్‌కు రోబోల అవసరం లేదంటూ రాసుకొచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు సైతం తమదైన శైలిలో భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇదికదా అసలైన వృత్తి నైపుణ్యం అంటే..అంటున్నారు నెటిజన్లు.

North Korea: కరోనా కేసులే లేవన్న కిమ్‌ కింగ్‌డమ్‌లో లక్షకు పైగా పాజిటివ్స్‌..పరిస్థితి చెప్పలేమంటున్న నిపుణులు

Viral video : విష సర్పంతో చిన్నదాని ఆటలు..కసితో రగిలిపోయిన స్నేక్‌ ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..